రాష్ట్రీయం

క్రాంతిసేన లేఖపై అనుమానాలెన్నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: నరుూం ఎన్‌కౌంటర్‌పై క్రాంతిసేన విడుదల చేసిన లేఖపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నరుూంది బూటపు ఎన్‌కౌంటర్ అని, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వదలిపెట్టేది లేదని క్రాంతిసేన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన విషయం తెలిసిందే. క్రాంతిసేన కేంద్ర కమిటీ సభ్యులు జగత్ పట్నాయక్ (ఒడిశా), మధు (మహారాష్ట్ర) పేరిట విడుదలైన ప్రకటనలో ఆగస్టు 7న నరుూంను పోలీసులు అదుపులోకి తీసుకొని మరుసటి రోజు కాల్చి చంపినట్టు పేర్కొన్నారు. అయితే ఈ లేఖ లెటర్‌హెడ్‌లో కాకుండా తెల్లకాగితంపై రాసి ఉండడం, ఎన్‌కౌంటర్ జరిగిన పది రోజుల తరువాత (ఆగస్టు 18) వారి సంతకాలతో కూడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. నరుూంకు పోలీస్ ఉన్నతాధికారులు, బడా వ్యాపార నేతలతో సంబంధాలు ఉన్నట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో క్రాంతిసేన కేవలం టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేయడం కూడా క్రాంతిసేన లేఖపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీంతో క్రాంతిసేన లేఖలో యదార్థమెంత అనే మీమాంస వ్యక్తం మవుతోంది. ఇదిలావుండగా నరుూం ఎన్‌కౌంటర్ జరిగిన నల్గొండ జాతీయ రహదారిపై నరుూం టాక్స్ వసూలు యథేచ్ఛగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. భారీ లోడ్‌తో వెళ్లే వాహనాల నుంచి నరుూం టాక్స్ వసూలు చేసి పచ్చ స్టిక్కర్లు, టాక్స్ చెల్లించని వాహనాలకు ఎరుపు రంగు స్టిక్కర్లు అతికిస్తుండడంతో నరుూం అనుచరులు ఇంకా తమ అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రాంతిసేన పేరుతో విడుదలైన ఈ ప్రకటనతో పలువురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనలకు గురవుతున్నట్టు తెలుస్తోంది.