రాష్ట్రీయం

మూడంచెల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 27: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వటంపై సీమాంధ్రుల సహనాన్ని పరీక్షించవద్దని, తమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కేంద్రాన్ని హెచ్చరించారు. దీనిపై ఇక మూడంచెల పోరాటానికి శ్రీకారం చుడతానన్నారు. తొలిదశలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తానన్నారు. రెండో దశలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపిలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. అప్పటికీ కేంద్రంలో సానుకూలత వ్యక్తంకాకపోతే ప్రజలు రోడ్లపైకి వస్తానని, ప్రజల కోసం తాను ఎంతకైనా తెగిస్తానన్నారు. ప్రధాని మోదీ స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా అనే నినాదం ఇచ్చారనీ, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ద్వారా రాయితీలు కల్పించకపోతే యువత ఎలా దేశాభివృద్ధిలో ముందుకు సాగుతారని ప్రశ్నించారు. విభజన వల్ల తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టి చెందిందన్నారు. ఆంధ్రరాష్ట్రం లోటు బడ్జెట్ తో ఉండడమే కాకుండా రాజధాని లేని పరిస్థితిలో ఉందన్నారు.
కేంద్రాన్ని వ్యతిరేకిస్తే వారు సిబిఐని ఉపయోగిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తనతో అన్నారన్నారు. కేంద్రం అంటే భూతమో, రాక్షసో కాదన్నారు. సిబిఐ అంటే ఎందుకు భయపడాలని, తప్పుచేస్తే భయపడాలన్నారు. అలాంటిది లేనపుడు రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్రంతో పోరాడితే జరిగే నష్టం ఉండదన్నారు. అయితే పార్టీ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని, తాను అన్ని పార్టీల నేతలను కోరుతున్నానన్నారు. సీమాంధ్రుల పట్ల తేలిక భావంతో వ్యవహరించడం కేంద్రానికి మంచిదికాదన్నారు. ఇప్పటి వరకు సీమాంధ్రుల ప్రేమ, అభిమానాలు, ఓర్పులుమాత్రమే చూశారన్నారు. వాటికి పరీక్ష పెట్టి వారి పౌరుషాన్ని చూడద్దన్నారు. సీమాంధ్రుల్లో పౌరుషం తలెత్తితే దేశమంతా ఇటువైపు చూడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు.

చిత్రం.. శనివారం తిరుపతిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్. హాజరైన అభిమానులు