రాష్ట్రీయం

రామయ్య బంగారం భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 27: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్యకల్యాణ మూర్తులకు వినియోగించే రెండు బంగారు గొలుసులు ఈ నెల 19న మాయమైనట్లు గుర్తించారు. దీనిపై అప్పుడే దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవో ఫిర్యాదు మేరకు ఇద్దరు ప్రధానార్చకులు, ఇద్దరు ఉపప్రధానార్చకులు, ఒక విశ్రాంత అర్చకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తొమ్మిది రోజులు పాటు అనేక మలుపులు తిరిగిన ఈ వివాదానికి శనివారం తెరపడింది. స్వామి వారి ఆభరణాలు భద్ర పరిచే బీరువాలోనే మరో లాకర్‌లో అవి ఉన్నట్లుగా గుర్తించారు. ఈఓ రమేశ్‌బాబు తన చాంబర్‌లో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి మాయమైన ఆభరణాలు చూపించారు. సిఐ బాణాల శ్రీనివాసులు, ఎస్సై కరుణాకర్ పంచనామా నిర్వహించారు. మాయమైన బంగారు గొలుసులుగానే వాటిని నిర్ధారించారు. వెంటనే వాటికి శాంతిపూజలు నిర్వహించారు. ఈఓ రమేశ్‌బాబు మాట్లాడుతూ ఇది అర్చకుల పనిగానే భావిస్తున్నామన్నారు. ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని, వారిపై త్వరలోనే శాఖాపరమైన సంబంధిత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎండోమెంట్స్ కమిషనర్‌కు ఆభరణాలు దొరికిన విషయాన్ని వివరించానని తెలిపారు.

చిత్రం.. ఆభరణాలను చూపుతున్న ఈఓ, అర్చకులు