రాష్ట్రీయం

ఖరీఫ్ ఎండుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ఆంధ్ర రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. జూలైలో కురిసి మురిపించిన వర్షాలు ఆగస్టులో మొహం చాటేయడంతో అనావృష్టి పరిస్ధితులు అలముకున్నాయి. దరిమిలా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, గుంటూరు మెట్ట ప్రాంతాల్లో వరుసగా రెండో ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. రుణమాఫీ మూడవ విడత నిధులు విడుదల చేయకపోవడంతో, రైతులకు బ్యాంకు రుణాలు లభించట్లేదు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అన్నదాతలు రుణాలు తెచ్చుకుని ఆర్ధిక కష్టాల్లో ఇరుక్కుంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కేవలం 270 టిఎంసి నీరు లభ్యతగా ఉంది. దీనివల్ల సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టా, శ్రీశైలంపై ఆధారపడిన రాయలసీమ రైతులకు సాగునీరు అందడం లేదు. తాజాగా కృష్ణా బోర్డు విడుదల చేసిన నీరు కేవలం మంచి నీటి సరఫరాకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆంధ్రాలో జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు 385.7 మిమీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 343.5 మిమీ నమోదైంది. జూన్, జూలైల్లో వర్షాలు బాగా కురిసినా, ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు రాయలసీమ, ఆంధ్రాలో వ్యవసాయాన్ని కుంగదీశాయి. సగటు వర్షపాతం లోటు 15.1 శాతం ఉంది. ఆగస్టు నెలలో 141 మిమీ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 47 మిమీ వర్షం కురిసింది. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల కాకపోవడం, గోదావరికి వరద తగ్గడంతో పట్టిసీమ నుంచి పోలవరం కుడికాల్వ ద్వారా సాగునీరు ఆశించినట్లుగా రాకపోవడంతో డెల్టా ఎండుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 670 మండలాలకు 303 మండలాల్లో కరవులో చిక్కుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 27 మండలాలు, విజయనగరం జిల్లాలో 9 మండలాలు, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పుగోదావరిలో 22, పశ్చిమగోదావరిలో 27, కృష్ణా జిల్లాలో 24, గుంటూరు జిల్లాలో 26, ప్రకాశం జిల్లాలో 40, నెల్లూరు జిల్లాలో 45, చిత్తూరులో 66, కడప జిల్లాలో 18 మండలాలు, అనంతపురం జిల్లాలో 15 మండలాలు, కర్నూలులో 23 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.