రాష్ట్రీయం

కార్మిక హక్కులను హరిస్తున్న మోదీ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఆగస్టు 28: కార్మిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం హరిస్తోందని కేరళ మత్స్య, జీడిపిక్కల పరిశ్రమల శాఖ మంత్రి మెర్సి కుట్టిఅమ్మ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీడిపిక్కల కార్మికుల సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో అసంఘటిత రంగ కార్మికులు దుర్భరమైన జీవన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయతే కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలో కేరళలోని తమ సిపిఎం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కడుపు నిండా తినేందుకే కనీస వేతనం అడుగుతున్నారే తప్ప ఇతర సౌకర్యాల గురించి కాదని, ఎపి ప్రభుత్వం జీడిపిక్కల కార్మికుల సమస్యలను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం సెప్టెంబర్ 2న చేపట్టిన సార్వత్రిక సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జీడిపిక్కల కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు ఎపి వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావును కలవనున్నట్టు ఆమె తెలిపారు.