రాష్ట్రీయం

భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవెగౌడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 28: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని భారత మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ ఆదివారం దర్శించుకున్నా రు. హెలీకాప్టర్‌లో భద్రాచలం వచ్చిన వారు నేరుగా రామాలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆల య సంప్రదాయం ప్రకారం పరివట్టం కట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి గర్భగుడిలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామాలయం నిర్మించిన భక్తరామదాసు చరిత్రను దేవెగౌడ ఆసక్తిగా అర్చకులను అడిగి తెలుసుకున్నారు. సుదర్శనచక్రం విశిష్టతను తెలుసుకున్నారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి శేష వస్త్రాలతో సత్కరించారు. రా మాలయం జ్ఞాపికను మాజీ ప్రధానికి బహూకరించారు.