రాష్ట్రీయం

నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: హైదరాబాద్‌లో నకిలీ ఎడ్యుకేషనల్ సర్ట్ఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది. నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. జెఎన్‌టియు, ఆంధ్రా యూనివర్శిటీ, ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ యూనివర్శిటీల పేరుతో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, డిప్లొమాకు సంబంధించి, ఇంటర్, ఎస్‌ఎస్‌సి మెమోలను తయారు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న వేణు దినకర్‌రెడ్డి, ఏ రామారావు, జియాఉల్ హసన్‌లతోపాటు బ్రోకర్లు సి సునీల్ రెడ్డి, దా సరి మనోజ్, రబ్బర్ స్టాంపులు తయారు చేసే మోహన్‌లాల్, రాఘవలను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి వివిధ యూనివర్శిటీలకు చెందిన 250 మార్క్స్ మెమోలు, 50 ఖాళీ ఫర్మెట్ సర్ట్ఫికెట్లు, 100 బోనఫైడ్, టిసిలు, రెండు రబ్బరు స్టాంపులు, ఒక ల్యాప్‌టాప్, సిపియు, స్కానింగ్ అండ్ కలర్ ప్రింటర్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ బి లింబారెడ్డి తెలిపారు.