రాష్ట్రీయం

‘బోగస్’ ఐటి ఉద్యోగాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: హైదరాబాద్ హైటెక్ నగరంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐటి ఉద్యోగాలు కూడా బోగస్‌గా మారుతున్నాయి. అమాయక విద్యావంతులు ఉద్యోగాల కోసం బ్రోకర్ల చేతిలో మోసపోతున్నారు.
బోగస్ ఐటి సంస్థల పేరుతో నిరుద్యోగులకు కాల్ లెటర్స్ పంపిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని 170 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా రెండు లక్షల మంది ఇంజనీర్లు ఉద్యోగానే్వషణలో ఉంటున్నారు. అయితే ఐటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు మాత్రం కొందరికే లభిస్తున్నాయి. కాగా ఐటి కారిడార్‌లో కొందరు బ్రోకర్లు కార్యాలయాలు తెరచి బోగస్ కంపెనీల పేర్లతో పట్ట్భద్రులైన నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. మీకు ఉద్యోగం ఖాయం అంటూ కాల్ లెటర్స్ పంపిస్తున్నారు. నిరుద్యోగుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుల పేరిట కొంత డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు. గడచిన మూడేళ్లలో ఐటి శాఖ సమాచారం మేరకు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 48 వేల ఉద్యోగావకాశాలు ఉండగా, 2014-15లో 36వేల మంది అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలు పొందారు. మిగతా అభ్యర్థులు బ్రోకర్ల చేతుల్లో మోసపోయినట్టు సైబర్ క్రైం పోలీస్‌ల విచారణలో తేలింది. 2014లో ఐటి బ్రోకర్లు, ఐటి బోగస్ సంస్థలపై సైబర్ క్రైమ్ పోలీసులు 70 కేసులను నమోదు చేశారు.
39 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 1.3కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 2015లో 98 కేసులు నమోదు చేసి రూ. 3.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 2016 ఆగస్టు 5 వరకు 40 మంది నిందితులపై కేసులు నమోదు చేసి రూ. 2.7 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఐటి శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న బ్రోకర్లు, బోగస్ ఐటి సంస్థలపై చర్య తీసుకోవాలని నిరుద్యోగ పట్ట్భద్రులు కోరుతున్నారు.