రాష్ట్రీయం

పొట్టపై నుండి వంద బైక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 28: రాజమహేంద్రవరానికి చెందిన ఒక యువకుడు వంద బైక్‌లు (బుల్లెట్) తన పొట్టపై నుంచి నడిపించుకుని రికార్డు సృష్టించాడు. ఈ విన్యాసాన్ని గిన్నిస్ పుస్తకంలో నమోదుకు పంపారు. కరాటే, బాక్సింగ్, తైక్వాండోలో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన 21వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మా శ్రీనివాసరావు కుమారుడు ఉజ్వల్ స్థానిక పుష్కరాల రేవువద్ద ఆదివారం ఈ విన్యాసంచేశారు.
గిన్నిస్ పుస్తక ప్రతినిధుల సూచనల మేరకు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్‌కిషోర్, పశుసంవర్ధకశాఖ ఎడి డాక్టర్ రామకోటేశ్వరరావు, నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎంవిఆర్ మూర్తి పర్యవేక్షణలో ఈవిన్యాసం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శిక్షణ పొందిన బుల్లెట్ వాహనదారులతో ఉజ్వల్ తన ఉదరంపై నుంచి బుల్లెట్లను నడిపించుకున్నాడు. ఈ విన్యాసాన్ని 3 కెమెరాల్లో చిత్రీకరించి గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపుతున్నారు. రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ, డిప్యూటి మేయర్ వాసిరెడ్డి రాంబాబు, చల్లా శంకర్రావు, కార్పొరేటర్లు ఈ విన్యాసాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారంతా ఉజ్వల్‌ను అభినందించారు.

చిత్రం.. ఉజ్వల్ పొట్ట పైనుంచి వెళ్తున్న బైక్‌లు