రాష్ట్రీయం

ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/ హైదరాబాద్, ఆగస్టు 28: హిందూదేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఖరాఖండీగా పేర్కొన్నారు. దేవాలయ వ్యవస్థపై దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాలపై ఆదివారం రుషీకేష్‌లో జరిగిన సమావేశంలో స్వామీజీ మాట్లాడారు. రాజ్యసభ సభ్యు డు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, దేవాలయాలపై పభుత్వం ఆజమాయిషీ చేయాలే తప్ప, పెత్తనం చేయవద్దన్నారు. దేవాలయాలను నిర్మించి, ఈ ఆలయాలకు భూములు తదితర విలువైన ఆస్తులను ధారాదత్తం చేసిన ధర్మకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ నాయకులను పాలకమండళ్లలో నియమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూదేవాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వం మార్చివేసిందని, ఇది సహించరాని విషయమన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల ఆస్తులను వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేసే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళతామని సుబ్రహ్మణ స్వామి పేర్కొన్నారు. దేవాలయ వ్యవస్థను కాపాడి, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాలు నడిచే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. దేవాలయాలు పీఠాధిపతులు, హిందూధర్మ సంస్థల నేతృత్వంలో నడిచేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ సభలో పరమార్థనికేతన్ స్వామీజి, సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ బాండ్ అంబాసిడర్ గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రుషీకేష్‌లో పుణ్యసాన్నం ఆచరిస్తున్న స్వరూపానందేంద్ర, బిజెపినేత సుబ్రహ్మణ్యస్వామి