రాష్ట్రీయం

వేరుశనగ రక్షణకు ఎమర్జెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 29: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో నిలువునా ఎండుతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సీమలో పంటల రక్షణకు రెయిన్‌గన్ల ద్వారా రక్షక నీటి తడులు ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నాలుగు రోజుల్లో మొదటి తడి ఇవ్వడంతో పాటు వర్షాల పరిస్థితిని బట్టి మరో వారం రోజుల్లో రెండో తడి కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అవసరమైతే మూడో తడి ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేకంగా జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అనంతపురం జిల్లాలోని 31 మండలాల్లో ఎండుతున్న పంటల పర్యవేక్షణకు ఐఎఎస్ అధికారులు చేరుకున్నారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక మంత్రి, ఒక్కో నియోజకవర్గానికో ఐఎఎస్ అధికారి, మండలానికో గ్రూప్ -1 అధికారి క్షేత్ర స్థాయిలో నేటి నుంచి పర్యటించనున్నారు. ఆయా నియోజకవర్గ బాధ్యులైన మంత్రులు వీరిని సమన్వయం చేసుకుంటూ రక్షక తడులను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు సిఎం చంద్రబాబు మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకుని ఇక్కడే మకాం వేస్తారు. మూడు రోజుల పాటు ఆయన జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి ఎండిన వేరుశనగ పొలాలను ప్రత్యక్షంగా చూసి నీటితడులు అందించే ప్రక్రియను పర్యవేక్షిస్తారు.