రాష్ట్రీయం

‘హోదా’పై దూకుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 29: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్‌వార్ ముదురుతోందా? కేంద్రం పట్ల రాష్ట్ర వైఖరిలో మార్పు రానుందా? ఇంతకాలం సామరస్యంగా మెలగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక దూకుడుగా వ్యవహరించబోతున్నారా? రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే జవాబిస్తున్నాయి. విభజన చట్టంలో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొనలేదని పలువురు నాయకులు వాదిస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా ఏపికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నప్పటికీ.. దీనిపై ఇంతకాలం పోరాడే వైఖరిని అవలంబించలేదు.
మరోవైపు ప్రత్యేక హోదా గురించి ప్రజల్లో ఎలాంటి స్పందనా లేదని, విపక్షాలు కావాలనే బిజెపిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో హోదాపై కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేంతవరకూ రాష్ట్రానికి హోదా ఇచ్చే విషయాన్ని నాన్చుతూ వచ్చిన కేంద్రం తాజాగా ప్యాకేజీ ఇస్తామంటూ స్వరం మార్చింది. దీంతో రాష్ట్రానికి హోదా రాదనే విషయం దాదాపుగా స్పష్టమైంది. హోదాపై మాటమార్చిన కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిలదీయలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో విపక్షాలు అడపాదడపా ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఆయా పార్టీల నేతలు ఎంతగా రెచ్చగొట్టినా సిఎం మాత్రం కేంద్రం తో గొడవ పెట్టుకోడానికి సిద్ధపడటం లేదు. రాష్ట్రాన్ని ఆర్థికంగా కేంద్రం ఆదుకోవలసి ఉన్నందున ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోనే కేంద్రంతో మెలగాలని బాబు భావిస్తూవచ్చారు. అయితే, కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఇప్పటి వరకూ భారీ నిధులు కేటాయించినట్టు చెప్పుకుంటోంది. దీనిపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధి నిధులను అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికీ ఇచ్చినట్లు స్పష్టం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లోటును ఇప్పటివరకూ భర్తీ చేయలేదు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికీ కేంద్రం అరకొర నిధులనే విదిలించింది. విభజన చట్టంలోని 9,10 సెక్షన్ల కింద ఆస్తుల పంపకాల విషయంలో ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించడానికి కూడా కేంద్రం ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. ఇవన్నీ సీయంను బాధిస్తూనే ఉన్నాయి. అయినా రాష్ట్భ్రావృద్ధి కోసం ఆయన వౌనంగా ఉంటున్నారు.
కానీ, హోదా విషయంలో రాష్ట్రంలో రోజురోజుకూ పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం ఇప్పటికే లెక్కలు కడుతోంది. నేడో రేపో ప్యాకేజీని ప్రకటించేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసేదేమీ ఉండకపోవచ్చు. తరువాత హోదా గురించి పోరాడినా ఫలితం ఉండదు. సరిగ్గా ఇదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై తిరుపతి సభలో గళం విప్పారు. దశలవారీగా ఉద్యమించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. హోదాపై పవన్ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రులు సైతం సమర్థిస్తున్నారు. ఇంకోపక్క పవన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చర్చల కోసం తీసుకెళ్లేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పవన్ పొలిటికల్ ఇమేజ్ పెరిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోపక్క రాష్ట్ర ఉద్యోగ సంఘాలు కూడా హోదా ఇవ్వకుంటే రోడ్డెక్కుతామని ఇప్పటికే ప్రకటించాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గళం విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకూ కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన స్థాయిలో సహాయాన్ని అందించపోయినా ఓర్పుతో వ్యవహరిస్తున్న చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆయన ఇంకా నెమ్మదిగా వ్యవహరిస్తే పవన్‌తో చేయిచేయి కలిపి హోదా కోసం ఉద్యమించడానికి మిగిలిన పార్టీలన్నీ సిద్ధమై చంద్రబాబును మరింత ఇరకాటంలో పెట్టే అవకాశాలు లేకపోలేదు. కనుక కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ప్యాకేజీ కాదు, హోదా కావాలని చంద్రబాబు పట్టుబట్టాల్సిన సమయం ఆసన్నమైంది.