రాష్ట్రీయం

వ్యవసాయాన్ని లాభసాటి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంగనూరు/కుప్పం, ఆగస్టు 29: రైతుల సంక్షేమమే తన ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని ఆరెడిగుంట గ్రామంలో పొలం లో అమర్చిన రెయిన్‌గన్స్ పనితీరు, సేద్యపుకుంటలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో సాంకేతిక పద్ధతులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానన్నారు. వేరుశనగ పంటలను కాపాడేందుకు 24 గంటలూ వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్నామన్నారు. సాగునీటి కొరత నివారణకు రైతులకు 75 శాతం సబ్సిడీతో నీటి ట్యాంకర్లను సమకూర్చుతామని తెలిపారు. ప్రతి రైతు సేద్యపు కుంటలు తవ్వించి భూగర్భజలాలు పెంచాలన్నారు.
రాయలసీమను రతనాల సీమగా మారుస్తా
ఈఏడాది చివరికి మదనపల్లె, పుంగనూరు, కుప్పం వరకు హంద్రీనీవా నీటిని తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేసి నీరు అందించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎక్కడా ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. హంద్రీనీవా 650 కిలోమీటర్ల దూరం, 152 లిప్టుల ద్వారా పనులు జరుగుతున్నాయన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో 1640 చెరువులు ఉన్నాయని వాటికి హంద్రీనీవాతో నీరు అందించి పంటలకు సస్యశ్యామలంగా పంటలు పండించడానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, తమకు రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. రైతులకు విత్తనాలు సకాలంలో అందజేసి పంటలు పండించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఖర్చు తగ్గించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ప్రజలు అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా నష్టపోయామని ఫిర్యాదు చేయగా సంస్థ వారి ఆస్తులు అమ్మించి భాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కరవు ఎదుర్కొంటాం
కుప్పం నియోజకవర్గంలో ఏర్పడ్డ కరవు పరిస్థితులను పరిశీలించేందుకే తాను వచ్చానని సిఎం స్పష్టం చేసారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం గుడుపల్లి మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పంట సంజీవిని, రెయిన్‌గన్స్, స్పింక్లర్ల ద్వారా కరవును పారద్రోలవచ్చని అయితే ఎవరూ ఊహించని విధంగా రాబోవు కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని యుద్ద ప్రాతిపదికన ప్రారంభించి అమలులోకి తీసుకువచ్చానని అన్నారు. ఇందులో భాగంగానే నేడు 80శాతం సబ్సిడీతో రెయిన్‌గన్స్‌తో పాటు స్ప్రింక్లర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న వేరుశనగ పంటను రక్షించేందుకు వ్యవసాయ అధికారుల ద్వారా రెయిన్ గన్ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే యాభైశాతం రైతులకు రెయిన్‌గన్‌లు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసామన్నారు. ఇంతలో గుడుపల్లి మండలానికి చెందిన పలువురు రైతులు కుప్పం నియోజకవర్గంలో మాత్రం రుణమాఫీ చేయాలని అడుగగా, తానెప్పుడూ పూర్తి రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వలేదని ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు ఒక సభ్యురాలికి మూడు వేల రూపాయల లెక్కన రుణం మంజూరు చేసానని త్వరలోనే 7వేల రూపాయల రుణాన్ని మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజలు ఉచిత ప్రభుత్వ పథకాలపై ఆశపెట్టుకోకుండా కష్టపడి సంపాదించేందుకు సుముఖత చూపాలని ఆయన అన్నారు.

చిత్రం.. చిత్తూరు జిల్లా ఆరడిగుంట గ్రామంలో వేరుశనగ పంట రైతుతో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు