ఆంధ్రప్రదేశ్‌

ఇదేం న్యాయం..బాబూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం/మనుబోలు, ఆగస్టు 30: పంటలు ఎండిపోతున్న అనంతపురం రైతులను ఆదుకునేందుకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలనుంచి వాటర్ ట్యాంకర్లను పంపించాలని స్థానిక అధికారులకు సోమవారం రాత్రి ఆదేశాలు అందాయి. దీనితో ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖరరావు, ఎంవిఐ రాంబాబు, పట్టణ ఎస్సై సుబ్బారావుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ట్యాంకర్లను నిలుపుదల చేసి అనంతపురం తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే నెల్లూరు జిల్లా మనుబోలునుంచి ఎంవిఐ అధికారులు వందలాది లారీలను సేకరించారు. విషయం తెలుసుకున్న అటు మార్కాపురం, మనుబోలు పట్టణాలకు చెందిన మహిళలు గుంపులుగా వచ్చి తాగునీటికి తాము ఇబ్బంది పడుతుంటే ఎక్కడో పంటలను బతికించేందుకు ఈ ట్యాంకర్లను తరలించడం అన్యాయమని అధికారులను నిలదీశారు. దీనితో స్పందించిన అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు, మున్సిపల్ డైరెక్టర్‌కు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అధికారులు పట్టణంలో నీరు సరఫరా చేసే ట్యాంకర్లు కాకుండా ఇతర ట్యాంకర్లు ఏవైనా ఉంటే వెంటనే అనంతపురం పంపాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో మార్కాపురం ఎంవిఐ రాంబాబు మంగళవారం మధ్యాహ్నానికి 60 ట్యాంకర్లను ,మనుబోలులో 60 ట్యాంకర్లను సిద్ధం చేసి అనంతపురం తరలించేందుకు ప్రణాళిక చేశారు. అయితే అనంతపురంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షాలు కురిశాయని, ట్యాంకర్లు అవసరం లేదంటూ అధికారులకు సమాచారం రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బెయిల్‌పై వచ్చాడు...
వేళ్లు కోసేశాడు!
అత్యాచార నిందితుడి అఘాయిత్యం
తికమ్‌గడ్ (మధ్యప్రదేశ్), ఆగస్టు 30: రాజీ చేసుకోవడానికి అత్యాచార బాధితురాలు ఒప్పుకోకపోవడంతో బెయిల్‌పై వచ్చిన సదరు నిందితుడు ఆమె రెండు వేళ్లను కోసేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ఓ యువతిపై అత్యాచారం జరిపిన కేసులో 45 ఏళ్ల కున్వర్‌లాల్‌కు స్థానిక కోర్టు గత నెలలో బెయిల్ మంజూరు చేసింది. రాజీ కుదుర్చుకోవడానికి నిందితురాలి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన ఆ రేపిస్టు ఏకంగా ఆమె చేతివేళ్లను కోసేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కున్వర్‌లాల్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.