రాష్ట్రీయం

కరవు కనిపించలేదా బాబూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 3: ప్రతిరోజు గంటల తరబడి అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించే ముఖ్యమంత్రికి రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమలో నెలకొన్న కరవు పరిస్థితులు తెలియవా అని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే బాబుకు సీమలో ఎండుతున్న వేరుశనగ కనిపించలేదా అని అన్నారు. కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట వైకాపా, వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన రైతులు, పార్టీ కార్యకర్తలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల సమస్యలు విస్మరించారన్నారు. ఏరియల్ సర్వేకే పరిమితమయ్యారన్నారు. బాబుకు కనువిప్పు కలిగించి కరవును ఆయన దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ మహాధర్నా చేపట్టామన్నారు. సీమలో వర్షాభావం వల్ల ఏర్పడిన కరవు నుంచి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెయిన్‌గన్ల వల్ల ఉపయోగం శూన్యమన్నారు. మండలానికి నాలుగు రెయిన్‌గన్లు ఇస్తే నీళ్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. సీమ జిల్లాల్లో పంటలు సాగుచేసిన ప్రతి రైతుకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఎకరాకు రూ.10 నుంచి రూ.15 వేలు చెల్లించాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు దాదాపు15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగు వేశారని, వర్షాలు లేక పంటలన్నీ ఎండుతున్నాయని అన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో బాబు అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటిమట్టం అమలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కోట్లు ఖర్చుచేస్తున్నా ఒక ప్రాజెక్టు కూడా పూర్తికాలేదన్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్‌కు నీరు విడుదల చేస్తామని ప్రకటన చేస్తున్నారే తప్ప ఆచరణలో చూపలేదన్నారు. రెండేళ్ల పాలనలో రెండు టిఎంసిల నీరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జనవరి వరకు కెసికి నీళ్లివ్వకపోతే 92 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
రైతుల భూములను రాజధాని నిర్మాణం పేరిట లాక్కొని సింగపూర్ దేశానికి కట్టబెట్టారని జగన్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసిందల్లా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం , వెన్నుపోటు పొడవటం మాత్రమేనన్నారు. కొడుకు లోకేష్ తండ్రిబాటలో పయనిస్తున్నాడని ఆరోపించారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి హయాంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పనులు పూర్తిచేశారన్నారు. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ఆ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయంగా మరోటి ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. ధర్నాలో ఎంపిలు మిధున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, ఎస్.రఘురామిరెడ్డి, రాచమల్లు వెంకటశివ ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, పి.రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట శనివారం
జరిగిన మహాధర్నాలో మాట్లాడుతున్న జగన్మోహన్‌రెడ్డి