ఆంధ్రప్రదేశ్‌

క్రీడల్లో రాణిస్తున్న మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 4: దేశంలోని మహిళలు క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారని రియో ఒలింపిక్స్ రజత పతకం విజేత పివి సింధు తెలిపారు. ఆదివారం సింధు తన శిక్షకుడు పుల్లెల గోపీచంద్, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా టిటిడి జెఇఓ పోలా భాస్కర్ ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం పలికారు. సింధు, పుల్లెల గోపీచంద్‌లకు జెఇఓ పట్టువస్త్రం ఇచ్చి గౌరవించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇదిలావుండగా సింధు తన 68 కిలోల బరువు కలిగిన బెల్లాన్ని తులాభారంగా శ్రీవారికి కానుకగా ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆమె విలేఖరులతో మాట్లాడుతూ దేవుడు ఆశీర్వదించాడని, అందుకు మొక్కు తీర్చుకోవడానికి తాను తిరుమలకు వచ్చానన్నారు. రియో ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందు తాము స్వామివారిని దర్శించుకున్నామన్నారు. రియోలో గెలిచిన తరువాత తిరిగి స్వామిని దర్శించుకొని కలకండ తులాభారంగా ఇస్తామని మొక్కుకున్నారన్నారు. అందుకే తిరిగి తిరుమలకు వచ్చానన్నారు. రజత పతకం సాధించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, మరింత శ్రమించి దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా ఇనుమడింప చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. యువతులు క్రీడల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రతి యువక్రీడాకారిణి గొప్ప విజయాలు సాధించాలని తాను భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
శ్రీవారి కృపతోనే పతకం : గోపీచంద్
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని కృపతో పివి సింధూ రియోలో రజత పతకాన్ని సాధించిందని ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. వెళ్లేముందు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందామని, సింధు శ్రమకు స్వామివారి కృపాకటాక్షాలు తోడై విజయం సాధించిందన్నారు. అందుకే తాను స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నానన్నారు. మరింతమంది యువ క్రీడాకారులను తయారుచేయడమే తన సంకల్పమని ఆయన పేర్కొన్నారు.

ఇక ప్రతి నెలా
కవి సమ్మేళనం
‘పెనే్నటి మలుపులు’ ఆవిష్కరణలో పల్లె
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, సెప్టెంబర్ 4 : రాష్ట్రంలో ఇకపై ప్రతి నెలా కవి సమ్మేళనం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, భాష, సంస్కృతి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రంలో త్వరలో సాహిత్య, లలిత సంగీత అకాడమీలను ప్రారంభించనున్నామన్నారు. అనంతపురంలోని లలితకళా పరిషత్‌లో ఆదివారం రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఆర్డీటీ కల్చరల్ సొసైటీ, విమలా శాంతి సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శాంతినారాయణ రచించిన ‘పెనే్నటి మలుపులు’ నవలను ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పల్లె ఆవిష్కరించి ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే్న ఫెర్రర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి పల్లె మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి శనివారం కూచిపూడి, భరతనాట్యం, తదితర కళారూపాలను నిర్వహించాలని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు పెరిగాయని, నైతిక విలువలు దిగజారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కవులు తమ రచనల ద్వారానే మార్చగలరని ఆకాంక్షించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 6,740 మంది కళాకారులకు నెలా నెలా పింఛను అందజేస్తోందన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులన్నీ
పూర్తి చేస్తాం
నిధులకు కొరత లేదు : మంత్రి ఉమ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో అదనపు ఆయకట్టును తీసుకురావడానికి అవసరమైన సాగునీటితో పాటు ప్రజలందరికీ పుష్కలంగా మంచినీటిని అందించేందుకై ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్యత ప్రాజెక్టులన్నింటినీ సత్వరమే పూర్తి చేయనున్నామని ఇందుకు అవసరమైన నిధులకు ఎలాంటి కొరత లేదంటూ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే ఏడువేల 325 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు తగు ప్రణాళికలను సిద్ధం చేయటం జరిగిందన్నారు. అయితే ఇప్పటివరకు మూడువేల 504 కోట్లు ఖర్చు చేసామన్నారు. శనివారం రాత్రి తన కార్యాలయంలో మంత్రి ఉమా వివిధ ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఆదివారం వాటి వివరాలను ఆయన వెల్లడించారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఈ ఏడాది రూ.650 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటివరకు 8వేల 28 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం తొలిదశ పనులు 91 శాతం పూర్తయ్యాయని అన్నారు. ఇక ప్రస్తుతం 30వేల ఎకరాలకు సాగునీరు అందించగలమన్నారు. 216 కిమీ పొడవైన ప్రధాన కాలువ నిర్మాణంలో భాగంగా 13 కిమీ పొడవైన ఐదు టనె్నల్స్ 8 టిఎంసిల నీటి నిలువ సామర్ధ్యం కల్గిన 8 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లను పూర్తిచేయటం జరిగిందని మంత్రి దేవినేని తెలిపారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు తొలి దశకు ఈ ఏడాది 210 కోట్లు ఖర్చు చేయగా మొత్తంపై రూ.4వేల 825 కోట్లు ఖర్చు చేయటం జరిగిందన్నారు. తొలిదశలో 35వేల ఎకరాలకు రెండో దశలో 2లక్షల 25వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో తోటపల్లి రిజర్వాయర్ పనులపై ఈ ఏడాది రూ.50 కోట్లు ఇప్పటివరకు రూ.766కోట్లు ఖర్చుచేసి ప్రస్తుతం లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు. వంశధార రెండో దశ పనుల కోసం ఈ ఏడాది రూ.431 కోట్లు, ఇప్పటివరకు రూ.776 కోట్లు ఖర్చు చేసామన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై రూ.614 కోట్ల ఖర్చుతో వివిధ పనులు చేపట్టటం జరిగిందన్నారు.
ఉపాధ్యాయ అవార్డులకు
139 మంది ఎంపిక
7న సిఎం ఆధ్వర్యంలో వేడుకలు
ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 3: ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డులకు 2016వ సంవత్సరానికి 139 మందిని ఎంపిక చేసినట్టు ఉన్నత, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్ డి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యకు సంబంధించిన ఉపాధ్యాయులు 67 మందికి, జూనియర్ కళాశాలకు చెందిన అధ్యాపకులు 13 మందికి, సాంకేతిక కళాశాలకు చెందిన అధ్యాపకులు 5గురికి, విశ్వవిద్యాలయాలు, కళాశాల విద్యకు చెందిన అధ్యాపకులు 54 మందికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు ఆమె తెలిపారు. అవార్డు కింద ఒక మెడల్, మెరిట్ సర్ట్ఫికెట్, శాలువాతో పాటు రూ.3వేల నగదు బహుమతిని అందజేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి హాజరై అవార్డులు అందజేస్తారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలను విజయవాడలోని మున్సిపల్ ఎంప్లారుూస్ కాలనీలో నున్న ఎ-ప్లస్ కనె్వన్షన్ సెంటర్‌లో ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.