తెలంగాణ

టి.టూరిజానికి అంతర్జాతీయ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. అమెరికాలోని హూస్టన్ నగరంలో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవంలో చందూలాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో చాటిచెపుతున్న ప్రవాసులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ పూర్వ వైభవ పునాదుల మీద నిలబడి, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. పర్యాటకుల భిన్నమైన అభిలాషలను, ప్రాధాన్యతలను నెరవేర్చడానికి ప్రభుత్వం వారసత్వ పర్యాటకం, సాంస్కృతిక పర్యాటకం, గిరిజన పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజంలను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. త్వరలోనే ప్రవాస తెలంగాణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రవాస తెలంగాణ వాసులంతా తెలంగాణ సంస్కృతి రాయబారులుగా పని చేసి తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలని చందూలాల్ కోరారు. తెలంగాణ గొప్పతనం, చరిత్ర, పర్యాటక ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు విదేశాల్లోని టూర్ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని రమణీయ ప్రాంతాలు, కాకతీయుల కాలం నాటి విశాలమైన, సుందరమైన చెరువులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. భవిష్యత్తు పర్యాటక చిత్ర పటంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతుందన్నారు.

విమర్శించే
హక్కు లేదా?!
కవితను ప్రశ్నించిన టి-జాక్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 4: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలకు, ప్రజాసంఘాలకు ఇతరులకు ఉంటుందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజాక్) పేర్కొంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుందని టిజెఎసి కన్వీనర్ పిట్టల రవీందర్ పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్‌ఎస్‌ఎఫ్) ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఈ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా, ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే టిజెఎసి ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి చర్చించిందని తెలిపారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవవద్దో టిజెఎసి ఇష్టమన్నారు. ఈ సమావేశానికి తనను (ఎంపి కవిత) పిలవలేదంటూ కవిత చేసిన విమర్శ సహేతుకం కాదన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం వల్లనే, ఆ విషయాలను గుర్తు చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని రవీందర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా పభుత్వంలో కొనసాగుతున్న వారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

హైకోర్టు సిజెతో
విచారణ జరపాలి
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్ 4: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల వేదిక నాయకులు చిక్కుడు ప్రభాకర్, సాంబశివరావు, అచ్యుతరావు, నారాయణ రావు, సూర్యపల్లి సుజాత మాట్లాడారు. ప్రజా హక్కుల గురించి పోరాడే వారిని హతమార్చేందుకే రాజ్యం నరుూంను తయారు చేసిందని విమర్శించారు. ఆంధ్రా సిఎం చంద్రబాబు హయాం నుంచి నరుూం అరాచకాలు మొదలుకాగా, అనంతరం రాష్ట్రాన్ని పాలించిన రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు నరుూంను పాముగా వాడుకున్నారని నిశితంగా విమర్శించారు. ప్రజా గాయకురాలు బెల్లి లతితతోపాటు పౌర హక్కుల నేతలు పురుషోత్తం, నారాయణ రావు, మాజీ మావోయిస్టులు సాంబశివుడు, కోనపురి రాములు వంటి వారిని హతమార్చడం వెనుక పాలకుల హస్తం ఉందని ఆరోపించారు.
ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున నాటి గ్రేహౌండ్స్ దళపతి కెఎస్ వ్యాస్‌ను అతిదారుణంగా చంపిన నరుూంను తమ అవసరాల కోసం పోలీసులు పెంచి పోషించడం హేయమైన చర్య అని అన్నారు. నరుూం ఆగడాలకు అండగా ఉన్న ప్రజాప్రతినిధులు, పోలీసులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లో తన దందాను విస్తరించిన నరుూం కేసును సిట్‌చే విచారణ జరిపించడం వల్ల ఉపయోగం లేదని, దోషులందరికీ శిక్ష పడాలంటే హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి లేదా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నేతల ‘లింకు’లపై దుమారం

నరుూంతో మంచిరెడ్డికి సంబంధాలు: మల్‌రెడ్డి
నాకెలాంటి సంబంధాలు లేవు: మంచిరెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 4: నరుూంతో సంబంధాలు నెరిపిన రియల్టర్లు, రౌడీ షీటర్లే కాకుండా పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తిస్తున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఎంపిపిలు, అరెస్టు కాగా, ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు కూడా బదిలీ అయ్యారు. ఓ ఎమ్మెల్సీపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం కూడా తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు నరుూంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యం ఆసక్తికరంగా మారింది. నరుూంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. నరుూం అండతో వేల కోట్లు సంపాదించారని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో పేదల భూములు లాక్కున్నారని, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దగ్గర వేల కోట్ల నరుూం డబ్బు ఉందని, సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నరుూంతో సంబంధాలు ఉండడం వల్లే టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి చేరారని ఆరోపించారు. ఆదిభట్లలో స్థల వివాదం కేసులో మంచిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తప్పుడు ఆరోపణలు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
గ్యాంగ్‌స్టర్ నరుూంతో తనకెలాంటి సంబంధాలు లేవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఒక ఎకరం స్థలానికి సంబంధించి మాత్రమే వివాదం ఉందని ఆయన చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, నరుూంతో వివాదం ఉన్న భూమికి సంబంధించి వివాదం ఏడి సర్వేలో తేలుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్‌రెడ్డి ఆస్తులన్నీ ప్రజల నుంచి లాక్కున్నవేనని ఆయన ఆరోపించారు. తనపై ఆరోపణలు రుజువు చేయకపోతే కోర్టులో కేసు పెడతానని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

ప్రాణం తీసిన
ఈత సరదా
మహబూబ్‌నగర్‌లో
ఇద్దరు కర్ణాటకవాసుల మృతి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 4: మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండలం గుడేబలూర్ పుష్కర్‌ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం ఇద్దరు కర్ణాటక వాసులు కృష్ణానదిలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఇందుకు సంబంధించి అందిన వివరాలు ఇలా ఉన్నాయ. కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన రసూల్ (33), రజా (26) పుష్కరఘాట్ వద్ద నదిలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. సమీపంలో ఉన్న వారు గమనించి స్థానికులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్లతో గాలించి రెండు మృతదేహాలను బయటకు తీశారు.
కర్ణాటక వాసులుగా గుర్తించిన కృష్ణా పోలీస్ స్టేషన్ అధికారులు రాయచూర్‌లోని మృతుల కటుంబాలకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.