జాతీయ వార్తలు

‘అచ్ఛే దిన్’ ఆయనకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథి, డిసెంబర్ 23: విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మో దీపై విరుచుకుపడ్డారు. ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) ప్రధానమంత్రికే వచ్చాయని, సామాన్య ప్రజలకు రాలేదని ఆయన విమర్శించారు. రాహుల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి లోక్‌సభ నియోజవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించడానికి బుధవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా నిగోహా, చాటోహ్ సహా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్డు పక్క సమావేశాలలో ఆయన మాట్లాడుతూ ‘అసాధారణ స్థాయిలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారికివి అచ్ఛే దిన్ కాదు. కేవలం ప్రధానమంత్రికే ఇవి అచ్ఛే దిన్’ అని రాహుల్ అన్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వంపై పార్లమెంటు లోపలు, బయట ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటానికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాం ధీ.. ధరల పెరుగుదల విషయం లో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్ర మే బిజెపికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతోందని అన్నారు. ‘దేశంలో ధరలు అసాధారణ స్థాయి లో పెరగడానికి బిజెపిదే బాధ్యత. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. రైతులు, యువతకోసం ప్రభుత్వం ఏ మీ చేయలేదు’ అని రాహుల్ విమర్శించారు. అమేథి నియోజకవర్గంలో మంజూరయిన ఫుడ్ పార్క్, పేపర్ మిల్లు ప్రాజెక్టులను రద్దు చేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన గ్రామ సర్పంచులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను గ్రామ సర్పంచుల ద్వారా అమలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం చాటోహ్ బ్లాక్‌లోని రంసాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికయిన గ్రామ సర్పంచులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘మెగా ఫుడ్ పార్క్, హిందుస్తాన్ పేపర్ మిల్‌ల ద్వారా అమేథి నియోజకవర్గం రూపురేఖలు మార్చాలని మేము భావించాం. ఈ ప్రాజెక్టుల వల్ల 15వే ల నుంచి 20వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించి ఉండేవి. ఈ ప్రాజెక్టులకోసం భూమి కూడా ఇవ్వడం జరిగింది. కాని, ఇక్కడ ఫుడ్ పార్క్ కాని, పేపర్ మిల్ కాని ఏర్పాటు చేయాలని బిజెపి కోరుకోవడం లేదు’ అని రాహుల్ అన్నారు.
‘మెగా ఫుడ్ పార్క్‌లో 40వరకు వివిధ ఫ్యాక్టరీలు నెలకొల్పాల్సి ఉండింది. వీటివల్ల రైతులు ఎంతో లబ్ధి పొందేవారు. కాని, ఆ ఆశలన్నీ నీరుగారాయి’ అని రాహుల్ పేర్కొన్నారు.
ప్రాజెక్టులను రద్దు చేస్తూ బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలని ఆయన గ్రామ సర్పంచులను కోరారు. ఆధునిక పంచాయతి రాజ్ వ్యవస్థ తన తండ్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ ఆలోచల నుంచి ఆవిర్భవించిందని ఆయన అన్నారు. గ్రామ సర్పంచులతో జరిపిన సమావేశంలో రాహుల్ గాంధీ వివిధ అంశాలపై చర్చించారు.

చిత్రం... అమేథిలో బుధవారం జరిగిన ఓ సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్