ఆంధ్రప్రదేశ్‌

వైకాపా తీరు గర్హనీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ హుందాతనాన్ని దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. వైకాపా సభ్యులు వ్యవహరించిన పద్దతి మంచిది కాదన్నారు. స్పీకర్ అంటే ప్రిసైడింగ్ అధికారి అని చెబుతూనే, ఆయన స్థాయి దిగజార్చే విధంగా వైకాపా సభ్యులు పనిగట్టుకుని మరీ గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు. అభివృద్ధి జరిగితే తన ఆటలు సాగవనే ప్రతిపక్ష నేత ఈ రకంగా వ్యవహరిస్తున్నారని సిఎం ఆరోపించారు. 1978 నుంచి క్రియాశీల రాజకీయాల్లో కొనసాగిన తాను ఇప్పటి వరకు పుచ్చలపల్లి సుందరయ్య వంటి హేమాహేమీలను, ఎన్టీఆర్ వంటి గొప్ప నేతలను చూశానని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్న ఏనాడూ అసెంబ్లీ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించలేదని సిఎం చెప్పుకొచ్చారు. వైకాపా రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వటం పుండు మీద కారం చల్లటమేనని, బంద్‌కు ప్రజలు సహకరించ కూడదని బాబు పిలుపునిచ్చారు.
మార్షల్స్‌తో కొట్టిస్తారా?
వైకాపా ఎమ్మెల్యేల ఆగ్రహం
హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్ 9: అసెంబ్లీలో అధికార పక్షం తీరు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా ఉందని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన శుక్రవారం మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించినందుకు తమ పార్టీ ప్రజాప్రతినిధులను మార్షల్స్‌తో కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా వ్యవహరించిందో ఆ విధంగా టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. మార్షల్స్ టిడిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు సభలోకి రాకముందే మార్షల్స్ ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులుగా తమ సమస్యలను స్పీకర్‌కు తెలియచేసే హక్కు లేదా అని మరో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు.
వాళ్లు అరాచకవాదులు:
వైకాపా సభ్యులపై మంత్రుల మండిపాటు
సభలో జరుగుతున్న పరిణామాలు దారుణమని, ఉన్మాదులు, అరాచకవాదులుగా వైసిపి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. లోటస్‌పాండ్‌లో ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీలో కుర్చీలు లేపడం, మైక్‌లు విరగ్గొట్టడంపై శిక్షణ ఇచ్చారని ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆరోపించారు. పవిత్రమైన సభలో సభాపతిపై దాడికి యత్నించడం సిగ్గుచేటని, అసెంబ్లీ చరిత్రలో ఇదో దుర్దినమని అభివర్ణించారు. కాగా రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదని మరో మంత్రి దేవినేని ఉమా అన్నారు. సభను ఒక్క నిమిషం కూడా జరగనివ్వకుండా అడ్డుపడటం ఉన్మాదుల చర్య కాదా అన్నారు. స్వార్ధపరుడు, అవినీతి పరుడు ప్రతిపక్ష నేత అయితే ఏ విధంగా ఉంటుందో ఏపి ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. సభపతిపై దాడి చేసేందుకు యత్నించిన జగన్ టీంను సంవత్సరంపాటు సస్పెండ్ చేయాల్సి ఉందని ఎమ్మెల్సి జూపూడి ప్రభాకరరావు అన్నారు.
ఏపిపిఎస్‌సికి కొత్తగా ఐదుగురు సభ్యులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు రాష్ట్రప్రభుత్వం కొత్తగా ఐదుగురిని సభ్యులుగా నియమించింది. ప్రస్తుతం కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ పి.ఉదయభాస్కర్ వ్యవహరిస్తున్నారు. ఆయన గత ఏడాది నవంబర్ 27న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012లో జిఎస్ సీతారామరాజు సభ్యుడిగా నియమితులయ్యారు. శుక్రవారం నాడు సభ్యులుగా నియమితులైన వారిలో అనంతపురం జెఎన్‌టియు మెకానికల్ విభాగం ప్రొఫెసర్ గింకా రంగ జనార్ధన , డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కె విజయకుమార్, హైదరాబాద్‌లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలోని లైబ్రరీ విభాగం ప్రొఫెసర్, అధిపతి ప్రొఫెసర్ గుర్రం సుజాత, కాకినాడ జెఎన్‌టియు ఇసిఇ శాఖ ప్రొఫెసర్ ప్రొఫెసర్ కె పద్మరాజు, రూరల్ డెవలప్‌మెంట్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రూప ఉన్నారు.