ఆంధ్రప్రదేశ్‌

కొప్పరపు పురస్కారంతో జన్మధన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (ఆరిలోవ), సెప్టెంబర్ 9: అవధాన విద్యలో మహోన్నత శిఖరాలు అధిరోహించిన కొప్పరపు కవుల పురస్కారం తనకు దక్కడం పూర్వ జన్మ సుకృతమని అవధాన సహస్ర ఫణి డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. కొప్పురపు కాళాపీఠం ఆధ్వర్యంలో మాగుడల నాగఫణి శర్మకు కొప్పరపు సోదర కవుల జాతీయ పురస్కారాన్ని విశాఖ కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ కొప్పరపు కవులు అపర సరస్వతీ మూర్తులని కొనియాడారు. అటువంటి అవధానుల పురస్కారాన్ని తల్లి, కుటుంబ సభ్యుల సమక్షంలో అందుకోవడం తన కెంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. గురువులు, తల్లిదండ్రుల అనుగ్రహంతోనే ఆశు కవిత అబ్బిందన్నారు. కొప్పరపు సోదర కవులు తన అవధాన ప్రక్రియకు స్పూర్తిదాతలని అన్నారు.
పూర్వజన్మ సుకృతం వల్లే ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని కొప్పరపు వారసుడు మా శర్మను ఆయన అభినందించారు. కొప్పరపు కవుల జాతీయ పురస్కారంతో పాటు రూ.లక్ష నగదును మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆశువుగా అనేక కవితలను ఆలపించారు. కార్యక్రమంలో సినీ రచయిత గొల్లపూడి మారుతీరావు, తదితరులు పాల్గొన్నారు.

మాడుగుల నాగఫణిశర్మను కొప్పరపు కవుల పురస్కారంతో
సన్మానిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, తదితరులు