రాష్ట్రీయం

మూడేళ్లు వేటు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడు రోజుల సమావేశాలు ఉద్రిక్త పరిస్థితుల మధ్య శనివారం ముగిశాయి. మూడవ రోజు కూడా సభ నియంత్రణలోకి రాకపోవడంతో నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావుప్రకటించారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో మూడు రోజుల పాటు సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాకుండా వైకాపా సభ్యులు స్పీకర్‌పై దాడికి ప్రయత్నించారని, సభా గౌరవాన్ని మంటగలిపారని, వారిని మూడు సంవత్సరాలపాటు సభకు రాకుండా నిషేధం విధించాలని, ఈ అంశాన్ని సభా హక్కుల సంఘానికి నివేదించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. శాసనసభ జరిగిన మూడు రోజుల్లో చోటుచేసుకున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దురదృష్టకరంగా మిగిలిపోతాయని, వీరి ప్రవర్తనా శైలిని వీడియో దృశ్యాల్లో పరిశీలించి చర్యలు తీసుకోవాలని మంత్రి యనమల తీర్మానంలో పేర్కొన్నారు.
శనివారం సభ ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలని, ఆ తర్వాతే ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యేలు పోడియాన్ని ముట్టడించారు. అయితే సభ్యులను సస్పెండ్ చేసి సభ నిర్వహించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. వైకాపా ఎమ్మెల్యేలు బల్లలు ఎక్కి స్పీకర్‌పై కాగితాలను విసిరివేయడం దుర్మార్గమైన చర్యన్నారు. అసెంబ్లీ కార్యదర్శి మెడ చుట్టూ వైరు వేసి అవమానపరిచారన్నారు. వీరి చర్యల వల్ల శాసనసభ పరువు పోయిందన్నారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ సభ గౌరవాన్ని కాపాడేందుకు వైకాపా ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలన్నారు. ఫ్యాక్షనిస్టు నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీ నడుస్తోందన్నారు. బిజెపి ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజు మాట్లాడుతూ అప్రజాస్వామ్య ధోరణులను సహించరాదన్నారు.
వైకాపాకు చెందిన కొందరు మహిళా ఎమ్మెల్యేలు పోడియం ఎక్కి స్పీకర్ వద్దకు రావడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారిని స్పీకర్ వారించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని వారిని స్పీకర్ కోరారు. మహిళ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని మార్షల్స్‌పై దాడికి యత్నించడం తగదన్నారు. అయినా సభ నియంత్రణలోకి రాకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. మళ్లీ సభ గంట తర్వాత సమావేశమైనప్పుడు సభలో వైకాపా ఎమ్మెల్యేలు పోడియం వద్దకు దూసుకెళ్లి కాగితాలు చింపి స్పీకర్‌పై వేశారు. దాదాపు ఏడెనిమిదిమంది ఎమ్మెల్యేలు బల్లలు ఎక్కి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. సభలో విపక్ష పార్టీ ఎమ్మెల్యేల నిరసనల హోరు కొనసాగడంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
రోజాపై సస్పెన్షన్ ఎత్తివేత వ్యవహారం
వైకాపా ఎమ్మెల్యే రోజాను గత ఏడాది డిసెంబర్ నెలలో సభకు రాకుండా ఏడాదిపాటు సస్పెండ్ చేశామని స్పీకర్ ప్రకటించారు. తన తీరుకు క్షమాపణ చెప్పేందుకు రోజా అంగీకరించారని, ఈ విషయాన్ని సభ ముందుంచుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన తీర్మానం ప్రతిని చదివారు.