జాతీయ వార్తలు

పాత విమానాలతో జవాన్ల ప్రాణాలు తీస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పాత వి మానాలను ఎందుకు ఉపయోగిస్తున్నారని, జవాన్ల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలోకి నెట్టుతున్నారంటూ మంగళవారం ఢిల్లీలో కూలిన బిఎస్‌ఎఫ్ విమానం ప్రమాదంలో మృతి చెందిన జవాన్ల బంధువులు బుధవారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రశ్నల వర్షంతో నిలదీశారు. రాంచీకి బిఎస్‌ఎఫ్ సాంకేతిక సిబ్బందిని తీసుకెళ్తున్న దాదాపు ఇరవై ఏళ్ల వయసు కలిగిన బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ చిన్నపాటి విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి బయలుదేరిన కొద్ది సేపటికే నగరంలోని ద్వారకా ప్రాంతంలో కూలిపోయి మంటల్లో మసైపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 10 మంది సిబ్బంది మృతి చెందారు.
విధి నిర్వహణలో ఉన్న జవాన్లు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి ముందుగా ఈ సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రమాదంలో మృతి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ రబీందర్ కుమార్ కుమార్తె ఆగ్రహంగా రాజ్‌నాథ్‌ను, బిఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ డికె పాఠక్‌ను నిలదీసింది. ‘ఇలాంటి ప్రమాదాల్లో సైనికులు మాత్రమే ఎందుకు మరణిస్తున్నారు, విఐపిలెవరూ ఎందుకు చనిపోవడం లేదోజవాబు చెప్పండి’ అని హోం మంత్రి మృతుల భౌతిక కాయాలపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించిన అనంతరం మృతుల కుటుంబ సభ్యులను కలుసుకోవడం ప్రారంభించగానే ఆమె హోం మంత్రి ని ప్రశ్నించింది. చెమ్మగిల్లిన కళ్లతో రాజ్‌నాథ్ ఆ యువతిని ఓదారుస్తూ, మీ ఫిర్యాదులన్నిటినీ పరిశీలించడం జరుగుతుందని, మీరు లేవనెత్తిన ప్రతి ఒక్క అంశాన్ని తాను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పారు.
తమ వారి మృతదేహాలను చూడగానే మృతులంతా శోకాలు పెట్టడంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉండిన సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలోని బిఎస్‌ఎఫ్ హ్యాంగర్ ఒక్కసారిగా శోకసంద్రమైంది. తమ ఆత్మీయులకు అశ్రునివాళి అర్పించడం కోసం వచ్చిన మృతుల కుటుంబ సభ్యులందరు కూడా దాదాపు ఇదే విధమైన ఫిర్యాదులు, కథనాలను వినిపించారు. ‘బిఎస్‌ఎఫ్ వైమానిక విభాగంలోని విమానాలన్నీ కూడా పాతబడిపోతున్నాయని, త్వరలోనే కొత్త విమానాలు రానున్నాయని మా అల్లుడు నాతో అన్నాడు. కొత్త విమానాలు ఎప్పుడొస్తాయో నాకైతే తెలియదు కానీ ఆ కొత్త విమానాలను చూడడానికి అతను ఈ లోకంలోనే లేడు’ అని కూలిపోయిన విమానం కో పైలట్ రాజేష్ శివ్‌రైన్ మామగారన్నారు. బిఎస్‌ఎఫ్ విమానాలన్నీ పాతబడిపోతున్నాయని, ‘రెడ్ టేపిజం’ కారణంగా కొత్త విమానాలు ఆగిపోయాయని తమ కుమారుడు తమతో చెప్తూ ఉండేవాడని మరో జవాను కుటుంబ సభ్యులు చెప్పారు.‘ఇది మాకే కాక ఈ విభాగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే అంశం. పాత విమానాలను ఉపయోగించడం ద్వారా ఒక సైనికుడి ప్రాణాలను ఎందుకు రిస్క్‌లో పడేయాలి?’ అని అసిస్టెంట్ ఎస్‌ఐ డిపి చౌహాన్ కుటుంబ సభ్యుడొకరు అన్నారు.
అయితే కూలిపోయిన విమానం కేవలం 20 సంవత్సరాల నాటిదేనని, మామూలుగా అయితే ఒక విమానం 40-45 ఏళ్ల దాకా కూడా పని చేస్తుందని బిఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ డికె పాఠక్ చెప్పారు. ప్రమాదంపై ప్రధాన దర్యాప్తును పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఏ) జరుపుతోందని ఆయన చెప్తూ, ప్రమాద కారణాలపై ఇప్పుడే ఊహాగానాలు చేయడం తొందరపాటవుతుందని అన్నారు. కూలిపోయిన బి-200 విమానం వారానికి మూడు రోజులు నడుస్తూనే ఉందని, ఎలాంటి సమస్యా లేదని పాఠక్ అంటూ ఏదయినా సాంకేతిక సమస్య ఎదురైతే వెంటనే దాన్ని సరిదిద్దడం జరుగుతుందని, అంతేకాదు, విమానం ఎగరడానికి తగినదని సాం కేతిక నిపుణులు సర్టిఫై చేసే దాకా దాన్ని అనుమతించమని చెప్పారు.

చిత్రం.. విమాన ప్రమాదంలో మృతి చెందిన జవాన్ల బంధువులను
పరామర్శిస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్