రాష్ట్రీయం

ఎంబిబిఎస్‌కు కనీస వయోపరిమితి తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఎంబిబిఎస్ చదివేందుకు కనీస వయోపరిమితి అంశంపై మరోమారు పునరాలోచించాలని రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎంసిఐ, ఇతర వైద్య నియంత్రణ సంస్థలను ఆదేశించింది. 17 ఏళ్లకే వైద్యవిద్య అభ్యసించిన వనమా శ్రీ వేంకట ధీరజ్ అనే విద్యార్ధికి ఎంసిఐ అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. విద్యార్ధి తరఫున న్యాయవాది వై బాలాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌కుమార్ కైత్ ముందు తమ వాదనలు వినిపించారు. ధీరజ్ 1992 సెప్టెంబర్ 13న పుట్టాడని , అప్పటి ప్రభుత్వం అనుమతితో 2005లో 13 ఏళ్ల వయసులో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడని, 2007లో ఎమ్సెట్ రాస్తే సీటు రాలేదని, దాంతో వెస్టిండీస్‌కు చెందిన ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ సంస్థ భారతీయ కార్యాలయం గుంటూరులో ఉంటే అక్కడ ఎంబిబిఎస్‌లో చేరి, పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌కు వీలుగా తనకు వయోపరిమతి అనుమతి ఇవ్వాల్సిందిగా 2010 ఏప్రిల్ 28న ఎంసిఐకి దరఖాస్తు చేయగా, దానిని 2015లో ఎంసిఐ తిరస్కరించిందని చెప్పారు. ఎంబిబిఎస్‌లో చేరడానికి ముందే అనుమతి తీసుకోలేదనే కారణంతో ఎంసిఐ తిరస్కరించిందని , నేడు అన్ని రంగాల్లో యువత బాగా రాణిస్తూ చిన్నతనంలోనే అనేక విజయాలు సాధిస్తున్న ఈ తరుణంలో ఆంక్షలు ఎంత వరకూ సబబని న్యాయవాది ప్రశ్నించారు. దాంతో న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి, ఎంసిఐకి నోటీసులు జారీ చేశారు.