రాష్ట్రీయం

ప్రధాని పదవి వద్దని లోకేశ్ చెప్పాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తన కుమారుడు లోకేష్ చెప్పినందుకే తాను అప్పుడు ప్రధాని పదవి వదులుకున్నానని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శనివారం శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత బాబు కొద్దిసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. తనకు అప్పట్లో ప్రధాని పదవి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తన కుమారుడు లోకేష్ ఇచ్చిన సలహా వల్ల వదులుకున్నానని చెప్పారు. ప్రధానమంత్రి పదవి తాత్కాలికమని, ముఖ్యమంత్రి పదవయితే శాశ్వతంగా ఉంటుందని లోకేష్ విశే్లషించడం వల్ల ఆ పదవిని వదులుకున్నానని వివరించారు. 28 ఏళ్లకే మంత్రినయిన తాను, 23 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రయత్నించానన్నారు.
తన మామ ఎన్టీరామారావు అప్పట్లో హీరోగా తిరుగులేని స్థానంలో ఉన్నారని, ఆయనను రాజకీయాల్లోకి రావాలని సలహా ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ప్రధాని వాజపేయిని ఒప్పించి అబ్దుల్ కలామ్‌ను రాష్టప్రతిగా చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తన అనుభవాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో 38 ఏళ్ల అనుబంధం ఉందని, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇక్కడే పనిచేశానని ఉద్విగ్నభరిత స్వరంతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించానని చెప్పారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడినుంచే పనిచేస్తానన్నారు.