రాష్ట్రీయం

డబ్బులు పాచిపోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోదా కావాలా? అభివృద్ధి కావాలా? విదేశీ రుణాన్ని కేంద్రమే భరిస్తుంది
2.25 లక్షల కోట్లతో ప్రాజెక్టులు వస్తున్నాయి చట్టం తెలిసిన వారితో హోదాపై చర్చకు సిద్ధం
విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి సవాల్

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ‘లడ్డూలు పాచిపోతాయి...కానీ డబ్బులు పాచిపోవు..’ అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై వ్యంగ్యోక్తులు విసిరారు. ప్యాకేజీలను పాచిపోయిన లడ్డూలతో పోల్చిన వారు డబ్బులు పాచిపోవు అనే విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. 14 ఆర్థిక సంఘం సూచన మేరకు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమేనని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. కేవలం ప్రత్యేక హోదానే కావాలా? లేక అభివృద్ధి కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో కొంత మేలు జరుగుతుంది కాదనను, కానీ అంతకంటే ఎక్కువే కేంద్రం చేయూతనిస్తోందని ఆయన తెలిపారు. ఈ విషయంలో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే చట్టం గురించి తెలిసిన వారు ఎవరైనా చర్చకు ముందుకు వస్తే అందుకు తాను సిద్ధమని చెప్పారు. భయపడి వెనక్కి వెళ్ళనని తెలిపారు. ప్రతి పల్లెలో, ప్రతి గొందులో చర్చ జరగాల్సి ఉందని అన్నారు.
కోరింది కెవిపి ఒక్కరే..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన వెంటనే ఏపికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని ఆరాటం, పోరాటం పేరిట హడావుడి చేస్తున్న నాయకులు విభజన చట్టం చేసే సమయంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను ఎన్ని సార్లు ప్రస్తావించినా, ఇప్పుడు ఆ అంశం ఎందుకూ? అంటూ దాట వేస్తున్నారని ఆయన కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. ఏపికి జరిగిన అన్యాయాన్ని చక్కబెట్టేందుకు కృషి చేస్తున్నానని, ఈ విషయంలో తనకు ఎవరి సర్ట్ఫికేట్ అవసరం లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన చెప్పారు. 2.25 లక్షల కోట్ల రూపాయల వివిధ ప్రాజెక్టులు రాబోతున్నాయని ఆయన తెలిపారు. చరిత్రలో ఏ రాష్ట్రానికీ ఏ ప్రభుత్వం ఈ రకంగా సహాయం చేయలేదని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. 1981లో పనులు ప్రారంభించిన నాయకులు ఏ మాత్రం పురోగతి సాధించకుండా, తమను విమర్శిస్తున్నారన్నారు. హోదాపై 35 మంది కేంద్ర మంత్రులను సమావేశపరిచి చర్చించానని అన్నారు. సాధారణంగా ప్రధాని మంత్రి మాత్రమే అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని, మోదీ తనపై ఉన్న ప్రేమతో, గౌరవంతో సమావేశాన్ని నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పారు. మంత్రులందరితో చట్టంలో ఉన్న అంశాలపై చర్చించి, ఏ అంశం ఏ మంత్రి పరిధిలో ఉందో తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనతో ఎపికి 22 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, అది కేంద్రం ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే రాష్ట్రాలు అభివృద్ధి చెందవని అన్నారు.
70 సార్లు జైట్లీతో..
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కనీసం 70సార్లు సమావేశమై ఉంటానని అన్నారు. ఐఐటి, ఐఐఐటీలు, ఎయిమ్స్ వంటివి ప్రత్యేక హోదా వల్ల రావన్నారు. అమరావతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చే ప్రతిపాదన ఉందని అన్నారు.