రాష్ట్రీయం

ముందుకా...వెనక్కా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల సౌధం అమరావతి నిర్మాణంపై తలెత్తిన స్విస్ చాలెంజ్ విధాన వివాదంపై హైకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. తీర్పు అనుకూలంగా వస్తే రాజధాని నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం చకాచకా ముందుకు వెళుతుంది. ఒకవేళ ప్రతికూలంగా వస్తే మాత్రం ఇంతవరకు చేసిన కసరత్తుకు విలువలేకుండాపోతుంది. లేదా ఏవైనా మారదర్శకాల్లో మార్పులు చేయాలనే తీర్పు వచ్చినా అమరావతి నిర్మాణానికి పెద్ద ఆటంకాలు ఉండకపోవచ్చు. స్విస్ చాలెంజ్ పద్ధతిని సవాలు చేస్తూ ఆదిత్య హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, మెసర్స్ ఎన్వైన్ ఇంజనీర్స్ సంస్ధలు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. వీటిపై వాదనలు ఈ నెల 8న ముగిశాయి. 9వ తేదీన అటార్నీజనరల్ రాష్ట్రప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అనంతరం 12వ తేదీన తీర్పు వెలువరిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ప్రకటించారు. ప్రభుత్వం పారదర్శంగా వ్యవహరించడం లేదని, సింగపూర్ కంపెనీలకే మొగ్గు చూపుతోందని పిటిషనర్లు ఆరోపించగా, అమరావతి నిర్మాణానికి అనుసరించిన స్విస్ చాలెంజ్ విధానంపై స్టే ఇస్తే జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, విదేశీ పెట్టుబడులు రావని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపిన విషయం విదితమే.
స్విస్ చాలెంజ్ విధానం ద్వారా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని ఈ ఏడాది జూలై నెలలోనే ఏపి మంత్రివర్గం తీర్మానించింది. దీనికి అనుగుణంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) జూలై 16వ తేదీన స్విస్ చాలెంజ్ కింద ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. సెప్టెంబర్ 1వ తేదీతో టెండర్ల దాఖలుకు గడువు ముగిసింది. కాని స్విస్‌చాలెంజ్ విధానాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ ఉండడంతో, రాష్ట్రప్రభుత్వం టెండర్ల పంపేందుకు గడువును సెప్టెంబర్ 13వ తేదీ వరకు పొడిగించింది.