ఆంధ్రప్రదేశ్‌

కారిడార్ల నుండి ఎన్‌హెచ్‌కు లింక్ రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్ల నుండి జాతీయ రహదారుల వరకు నాలుగు లైన్ల రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎపి ఆర్‌డిసి ఎండి జి జగన్నాధరావు అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జగన్నాధరావు మాట్లాడుతూ కారిడార్లలో పరిశ్రమలకు శంకుస్థాపనలు జరిగిన తక్షణమే రహదారుల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామన్నారు. అచ్యుతాపురం నుండి విశాఖపట్నం, రజానగరం నుండి కాకినాడ, కృష్ణపట్నం నుండి నెల్లూరు, దొనకొండ నుండి వినుకొండ, దొనకొండ నుండి అద్దంకి, దొనకొండ నుండి పొదిలి, దొనకొండ నుండి మార్కాపురం రహదారులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. ఈ రహదారుల నిర్మాణానికి ఆసియా బ్యాంకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్రంలో 14 వేల 722 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయన్నారు. వాటిలో 7 వేల 280 కిలోమీటర్లు ఇప్పటికే రెండు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేశామని, 7 వేల 500 కిలోమీటర్లు రెండు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 2019 నాటికి అన్ని రహదారులను రెండు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తామన్నారు. 2025 నాటికి ఆర్‌అండ్‌బి శాఖలోని అన్ని రోడ్లు రెండు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. జాతీయ రహదారుల్లో ప్రతి 50 కిలోమీటర్లకు విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు. తాత్కాలిక మరమ్మతులకు నిధుల కొరత ఉన్నందున పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయలేకపోతున్నామని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్ అండ్ బి శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.