ఆంధ్రప్రదేశ్‌

సర్కారుకు దన్ను డ్రోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: ప్రపంచంలోనే ఎప్పటికప్పుడు తెరపైకి వచ్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోటంలో రెండేళ్లుగా పోటీబడుతూ వస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, సీనియర్ ఐపిఎస్ అధికారి, డిజిపి నండూరి సాంబశివరావు చేరువ కావటంతోనే సరిగ్గా నెల రోజుల్లోనే వచ్చిన సత్ఫలితాలు ప్రపంచ దృష్టినే ఆకర్షింపబడుతున్నాయి. తొలిసారిగా కృష్ణా పుష్కరాల్లో చంద్రబాబు.. నండూరి.. నిత్యం గంట గంటకు ఒకేచోట నుంచి కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పుష్కర స్నాన ఘట్టాలు, పుష్కరనగర్‌లు.. శాటిలైట్ బస్, రైల్వేస్టేషన్‌లే కాదు.. చివరికి మూడువేల తాత్కాలిక మరుగుదొడ్లలో పారిశుద్ధ్యం గురించి కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలందించడమే గాక పొరబాట్లు.. నిర్లక్ష్య ధోరణులను సైతం సరిదిద్దగలగడంలో డ్రోన్ కెమెరాలు ఎంతగానో ఉపకరించాయి.. అంతేకాదు రాష్టవ్య్రాప్తంగా ఏ జాతీయ రహదారిపై కూడా ఎక్కడా ట్రాఫిక్ స్తంభించకుండా చూడగల్గారు.. ఈ డ్రోన్‌ల వల్ల ఇంతటి సత్ఫలితాలు చేకూరినప్పుడు అటు బాబు ఇటు నండూరి చూస్తూ ఊరుకుంటారా.. భారతదేశంలో అన్ని పక్షాల కార్మికులు జరిపిన సార్వత్రిక సమ్మె సందర్భంగానూ.. నిన్న కాకినాడలో జరిగిన పవన్ కల్యాణ్ సభ సమయంలోనూ.. తాజాగా ప్రత్యేక హోదా బంద్ సందర్భంగాను డ్రోన్‌ల సహాయంతో ఎక్కడ ఎలాంటి విచ్ఛిన్నకర విధ్వంస సంఘటనలు చోటుచేసుకోకుండా చూడగల్గారు.. వీటివల్ల ఆందోళనకారులు కూడా ఆచితూచి అడుగువేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రోన్‌లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ వ్యవస్థకు జోడించి ఒక్క పరిపాలనలోనే గాక ప్రజావసరాలు, ప్రజారక్షణకు, ప్రభుత్వ పనులకు వినియోగించదలచింది.. తొలిసారి చంద్రబాబు నగరంలో ఉండి పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను ఈ డ్రోన్‌ల సాయంతో మంత్రి దేవినేని ఉమ సహకారంతో స్వయంగా పర్యవేక్షించగల్గారు. తాజాగా చంద్రబాబు డ్రోన్ల సాయంతో రాయలసీమలో ఎండుముఖం పట్టిన వేరుశనగ పంటలను గమనించి తక్షణం రెయిన్‌గన్స్ ఉపయోగించి నాలుగు లక్షల ఎకరాల్లోని పంటను కాపాడగల్గారు. అసలు మనిషి కూడా వెళ్లలేని ప్రాంతానికి కూడా డ్రోన్లను పంపి వీడియోల ద్వారా వాస్తవాలు చూసి ఆయన చలించబట్టే నేరుగా అక్కడకు పయనమై కొద్దిరోజులపాటు బస చేయగల్గారు. ఇక ఎక్కడ ఏ విధమైన విపత్కర పరిస్థితులు తలెత్తినా మానవ ప్రమేయం కంటే యంత్రాలను నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. తాజాగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా చంద్రబాబు ఈ డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కాలం ఆదాతో పాటు ప్రజాధనం కూడా వృథా కాకుండా పోతోంది. అయితే చంద్రబాబు మాత్రం ఎంతటి ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటున్నా ఇప్పటికీ తాను నిత్యం విద్యార్థినేనని చెప్పుకుంటున్నారు.
అసలు ఈ డ్రోన్ అంటే ఏమిటనేది అత్యధిక మందికి తెలియదు. మనిషి లేకుండా గాలిలో ఎగురుతూ అప్పచెప్పిన పనిని పూర్తి చేసుకుని వచ్చే ఓ చిన్నసైజ్ హెలికాప్టర్ లాంటిది. దానికి బిగించిన కెమెరాలు, వీడియోలలో పరిసరాలన్నింటినీ రికార్డు చేస్తూ ఎప్పటికప్పుడు కంట్రోలు రూమ్‌కు చేరవేస్తుంటాయి. ఇప్పటివరకు విదేశాల్లో సైనిక అవసరాలకే ఇవి ఉపయోగపడుతూ వస్తున్నాయి. రోబోటిక్స్ రంగంలో అత్యంత ఆధునిక పరికరం ఇది. న్యూయార్క్‌లో జంట భవనాలపై బాంబులు పేలిన తర్వాత అమెరికా ప్రభుత్వం ఈ డ్రోన్‌లపై దృష్టి సారించింది. వీటి సాయంతో ఉగ్రవాదుల కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో జల్లెడ పట్టింది. వాస్తవానికి వీటి సాయంతోనే చాలామందిని మట్టుబెట్టగల్గారు.
తాజాగా చంద్రబాబు ఈ డ్రోన్‌ల ద్వారా గాలేరు-నగరి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల్లో తుంగ, గట్ల వెంబడి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటూ అక్కడి సిబ్బంది తక్షణం వాటిని తొలగిస్తున్నారు. దీనివల్ల నీరు సాఫీగా ప్రవాహమవుతోంది. తాజాగా ఇక సిసి రోడ్ల నిర్మాణ నాణ్యతను కూడా పరిశీలించాలని ఆయన నిర్ణయించుకున్నారు.