రాష్ట్రీయం

కండక్టర్ పోస్టులకు మంగళం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ పోస్టుల నియామకానికి మంగళం పాడనున్నట్టు తెలిసింది. ఈమేరకు చర్యలకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. కర్నాటక తరహాలో డ్రైవర్లతోనే సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే జరిగితే రాష్ట్రంలో దాదాపు 30వేల కండక్టర్ పోస్టుల నియమకాలు నిలిచిపోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన పారిశ్రామిక, ఆర్థిక విధానాల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్య కుదించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా డ్రైవర్లతో బస్సు సర్వీసులు నడిపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 9,800కు పైగా ఆర్టీసీ బస్సులు ఉండగా వీటికి తోడు 2,068 అద్దె బస్సులతో సేవలు అందిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 770 ఆర్టీసీ బస్సులు, 242 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఆరునెలల కిందటివరకు రాష్టవ్య్రాప్తంగా అన్ని డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో ఆర్టీసీ...బస్సులు నడుపుతుండేది. ఆ తరువాతనుంచీ డ్రైవర్లను మాత్రమే నియమించుకుంటూ వస్తోంది. కండక్టర్ల నియామకాలపై ఆసక్తి కనబరచలేదు. దీంతో ఆర్టీసీలో కండక్టర్ల కొరత తీవ్రమైంది. ఇప్పటికే సుదూర ప్రాంతాల సర్వీసులను ఇద్దరేసి డ్రైవర్లతో నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాలనుంచి రెండు మూడు స్టాపులుండే ప్రాంతాలకు సింగిల్ డ్రైవర్‌తో బస్సులు నడుపుతున్నారు. జిల్లా కేంద్రాల నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లె బస్సులకు మాత్రమే కండక్టర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. తాజాగా గ్రౌండ్ బుకింగ్ విధానానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ప్రధాన రహదారుల్లో వెళ్లే బస్సు సర్వీసులకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో గ్రౌండ్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో బస్సు ఆగే పలుచోట్ల కండక్టర్లను నియమించి ఎక్కేటప్పుడే ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంవల్ల 20 మంది కండక్టర్లు చేసే పనిని ఐదుగురితో చేయిస్తున్నారు. కాగా గ్రౌండ్ బుకింగ్ విధానంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నా యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.