రాష్ట్రీయం

అమరావతి సక్రమమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: అమరావతి నిర్మాణంలో అక్రమాలకు తావులేని రీతిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఇరువురి మధ్య దాదాపు గంటకుపైగా సంభాషణ సాగింది. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేయడం, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్ర మంత్రుల ప్రకటన అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. మూడు రోజులపాటు శాసనసభ జరిగిన తీరు, జిఎస్‌టి బిల్లు ఆమోదం తదితర అంశాలను కూడా సిఎం వివరించారు. అమరావతి నిర్మాణానికి పాటిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టులో నడుస్తున్న కేసులు గురించి కూడా చంద్రబాబు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, జల వివాదం, కాపుల రిజర్వేషన్ల అంశం, పవన్‌కల్యాణ్ కాకినాడ సభ తదితర అంశాలపై కూడా ప్రభుత్వపరంగా వివరణ ఇచ్చినట్టు తెలిసింది. గవర్నర్‌తో మంత్రివర్గ విస్తరణ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలిసింది. కాగా గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలు లేవని ముఖ్యమంత్రి కార్యాలయం వివరించింది.
ఢిల్లీకి గవర్నర్
న్యూఢిల్లీ : గవర్నర్ నరసింహన్ సోమవారం రాత్రి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ను పిలిచినట్టు తెలిసింది. గవర్నర్ మంగళవారం హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌సహా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. ప్రధాని మోదీని కూడా గవర్నర్ కలుసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

చిత్రం.. గవర్నర్ నరసింహన్‌ను కలిసిన సిఎం చంద్రబాబు