రాష్ట్రీయం

స్విస్ చాలెంజ్‌పై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేపట్టిన స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించింది. అమరావతిలో 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న నిర్మాణాలతోపాటు అనుబంధ నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. స్విస్ చాలెంజ్ విధానం నియమ నిబంధనలను బహిర్గతం చేసేలా ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, మెసర్స్ ఎన్వియాన్ ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. స్విస్ చాలెంజ్ పద్ధతిపై స్టే విధిస్తూ దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకూ మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేయాలని పేర్కొంది. నిర్మాణ రంగ కంపెనీలకు తెలియకుండా స్విస్ చాలెంజ్ ఏమిటని, రహస్యంగా కాంట్రాక్టులకు బిడ్లను ఆహ్వానించడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పాలనపరమైన పద్ధతులను పాటించకుండా, అక్రమాలకు దారితీసేదిగా నోటిఫికేషన్ ఉందని, ఒరిజనల్ ప్రాజెక్టు ప్రపోనెంట్ ఫైనాన్షియల్ బిడ్‌ను గోప్యంగా ఉంచడంవల్ల టెక్నికల్ బిడ్లు వేసిన వారికి పారదర్శకత ఉండటం లేదని పిటిషనర్ వాదించారు. రెవిన్యూ వాటా వంటి అధీకృత సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి శాస్ర్తియమైన పరిశోధన సమాచారాన్ని బిడ్డర్లకు అందజేయకపోవడం సరైంది కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఒపిపికి ఐదు నెలల గడువు ఇచ్చిన ప్రభుత్వం టెక్నికల్ బిడ్డర్లకు మాత్రం స్వల్ప వ్యవధి ఇచ్చిందని పేర్కొన్న న్యాయమూర్తి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల కేసులను నిలుపుదల చేయడం సరికాదని, అయితే టాటా సెల్యులర్ కేసు సందర్భంగా జరిగిన నిర్ణయాన్ని చూస్తే స్విస్ ఛాలెంజ్ విధానం కేసు ప్రత్యేకమైనదిగా గుర్తించి స్టే ఇస్తున్నట్టు న్యాయమూర్తి వివరించారు.
హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన స్టే ఉత్తర్వులపై హైకోర్టు పూర్తి స్థాయి బెంచ్‌లో సవాలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైకోర్టు ఆదేశాలపై సోమవారం నాడు మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ సీనియర్ మున్సిపల్ అధికారులతోనూ, సిఆర్‌డిఎ అధికారులతోనూ సమీక్షించారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని పరిశీలించిన మంత్రి తదుపరి చర్యలకు అధికారులను ఆదేశించారు.