రాష్ట్రీయం

నెల్లూరు కోర్టు ఆవరణలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 12 : నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం శక్తిమంతమైన బాంబు పేలింది. నగరం నడిబొడ్డున ఉన్న కోర్టు ఆవరణలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఈ పేలుడుతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు బాంబు శకలాలను, ఇతర ఆధారాలను సేకరించారు. ప్రెషర్ కుక్కర్‌లో బాంబును అమర్చి కుక్కర్ కన్పించకుండా జీన్స్ ప్యాంట్‌ను కప్పి ఉంచినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడూ సోమవారం కక్షిదారులతో కిక్కిరిసి ఉండే ఈ కోర్టు ప్రాంగణంలో సోమవారం సెలవు అనే ఉద్దేశంతో గతంలో ఎవరికి వాయిదాలు వేయకపోవడం, సెలవు దినాన్ని మంగళవారానికి మార్చడంతో కేవలం కోర్టు సిబ్బంది మాత్రమే ఉండడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాంబులో ఎటువంటి మెటీరియల్ వాడారో ల్యాబ్ పరీక్షల్లో తెలుస్తుందని, ఇది ఉగ్రవాద చర్యలా కనిపించడం లేదని చెప్పారు.

చిత్రం.. కోర్టు ఆవరణలో పరిశీలిస్తున్న బాంబు స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు