రాష్ట్రీయం

వాజ్‌పేయి స్ఫూర్తితో పెన్షన్లు, గృహ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: తమ పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ప్రధాని ఎబి వాజ్‌పేయి స్పూర్తితో పెన్షన్లు, గృహ నిర్మాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం వాజ్‌పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర శాఖ పేదలకు దుస్తులు, వికలాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేసింది. వాటిని పంపిణీ చేసిన అనంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రసంగిస్తూ వాజ్‌పేయ్ అజాతశతృవు అని, ప్రజల సంక్షేమానికి రాజకీయాలకు అతీతంగా ఆలోచనలు చేసే వారని చెప్పారు. 10 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారని, ఐదేళ్ళూ కాంగ్రెసేతర ప్రధానిగా ఉన్నారని తెలిపారు.