రాష్ట్రీయం

‘మాకీ’కి మరో అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబరు 14: ఏపి రాజధాని అమరావతిలోని ప్రధాన భవనాల డిజైన్లను మరోసారి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని అమరావతిలోని అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి పలు ప్రధాన భవనాలను నిర్మించే బాధ్యతను మాస్టర్ ఆర్కెటెక్ట్‌గా ఎంపికైన జపాన్‌కు చెందిన మాకీ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ భవనాలకు సంబంధించి మాకీ సంస్థ సుమారు నాలుగు నెలల కిందట డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ డిజైన్లపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైంది. ఈ డిజైన్లలో మార్పులు తీసుకురావాలని మన దేశానికి చెందిన పలువురు ఆర్కెటెక్ట్‌లను ప్రభుత్వం కోరింది. స్వల్పమార్పులు చేసినా ప్రభుత్వానికి మాకీ డిజైన్లు నచ్చలేదు. డిజైన్లను పూర్తిగా మార్చి తీసుకురావాలని కోరింది. మరో రెండు, మూడు రోజుల్లోగా చివరి డిజైన్లను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మాకీ సంస్థకు విజ్ఞప్తి చేసింది. గతంలో మాకీతోపాటు లండన్‌కు చెందిన రిచర్డ్స్ రోజర్, హఫీద్ కాంట్రాక్టర్ సహా అనేక సంస్థలు అమరావతి డిజైన్లను సమర్పించాయి. జపాన్ సంస్థ కాబట్టి మాకీని అప్పట్లో ఎంపిక చేశారు. అయితే, డిజైన్ల అంత సంతృప్తికరంగా లేకపోవడంతో వాటిని మార్చమని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ మాకీ తిరిగి సమర్పించే డిజైన్లు కూడా నచ్చకపోతే, ప్రభుత్వం మరో కొత్త సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది.

జపాన్‌కు చెందిన మాకీ సంస్థ రూపొందించిన రాజధాని డిజైన్

‘బిజెపికి అమ్ముడు పోయన చంద్రబాబు’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా బిజెపికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమ్ము డు పోయారని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. హోదా ఇవ్వకుండా బిజెపి ద్రోహం చేస్తే, ప్రధానికి ఫోన్ చేసి అభినందనలు తెలియచేయడమేంటని ఆయన నిలదీశారు. ఏపికి కేంద్రం ఇచ్చినట్లు చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీలో కూడా స్పష్టత లేదని, ప్యాకేజీ ఎటువంటి పరిస్థితుల్లోను హోదాకు సమానం కాదని, దీనిపై తాను బిజెపితో చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదానే సంజీవని అని అన్నారు.
పోలవరానికి ఇచ్చింది రూ. 100 కోట్లే
కేంద్రంపై కాంగ్రెస్ ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 14: కేంద్ర ప్రభుత్వం (2016-17) వార్షిక బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు కంటి తుడుపు చర్యగా వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని ఎపి కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.తులసి రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.
కానీ దురదృష్టవశాత్తు పోలవరం అథారిటీ ఏర్పాటుకే సంవత్సర కాలం పట్టిందని ఆయన తెలిపారు. ఈ 27 నెలల్లో కేంద్రం విడుదల చేసింది 850 కోట్లు మాత్రమేనని ఆయన తెలిపారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. 2004 జూలైలో పరిపాలనా అనుమతి ఇచ్చిందని, 5575 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేసిందని ఆయన వివరించారు. 33 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించే కుడి కాలువ పనులు 90 శాతం పూర్తి చేసిందని డాక్టర్ తులసి రెడ్డి చెప్పారు.