రాష్ట్రీయం

ఆ రెండు బిల్లులను తిప్పిపంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును, ప్రభుత్వ భూముల లీజు గడువును 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకు పెంచుతూ ఆమోదించిన బిల్లును తిరస్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు రఘువీరా రెడ్డి శుక్రవారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బిల్లులను ఆమోదించుకునే విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే ఈ బిల్లులను తిప్పి పంపాలని ఆయన గవర్నర్‌ను కోరారు.
ప్రభుత్వ భూముల లీజును 33 నుంచి 99 ఏళ్ళకు పెంచడం రాష్ట్రానికి తీరని నష్టమని ఆయన ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంతో పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను, రైతుల నుంచి సేకరించిన భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చే విషయంలో ఇప్పటి వరకు ఉన్న 33 సంవత్సరాలనే కొనసాగించాలని ఆయన కోరారు. అంతకు మించి లీజు గడువు పొడిగిస్తే కొద్ది మంది పెట్టుబడిదారులకు భారీగా లబ్ధి చేకూరుతుందే తప్ప ప్రజలకు మేలు జరగదని ఆయన తెలిపారు. కాబట్టి ఈ బిల్లును ఆమోదించకుండా ప్రభుత్వానికి తిప్పి పంపాలని ఆయన కోరారు.
ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందని ఆయన విమర్శించారు. ఈ యూనివర్శిటీల ప్రైవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, మహిళలకు రిజర్వేషన్లు వర్తించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆయన విమర్శించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ అసెంబ్లీలో ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఆ మహనీయుని ఆలోచనలకు తిలోదకాలు ఇవ్వడం అత్యంత విచారకరమని రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ రకాలైన 20 యూనివర్శిటీలు ఉండగా, విభజన చట్టం ప్రకారం మరో 10 వరకు కేంద్ర యూనివర్శిటీలు ఏర్పాటు కావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గం, అధికార పార్టీలోని కొందరు ప్రజాప్రతినిధులు ప్రైవేటు విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. వారికి నేరుగా లబ్ధి చేకూరేందుకే ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతిస్తూ చట్ట సవరణ తెస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు.