రాష్ట్రీయం

కొత్త విమానాశ్రయాలకు సాంకేతిక ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 25: విభజన తర్వాత రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు అన్నారు. రెండు రాష్ట్రాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వాలు ముందుకు రాకపోవడమేకాక భూ సేకరణ, భారీగా నిధుల అవసరం తదితర ఇబ్బందులున్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయ రన్‌వేను విస్తరించాల్సివుందన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం విమానాశ్రయాన్ని పునరుద్ధరించచడానికి కొన్ని సాంకేతికపరమైన లోపాలు ఎదురవుతున్నాయన్నారు. సాంకేతిక లోపాలను అధిగమించి, భూసేకరణ చేస్తే, గూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు తనవంతు కృషిచేస్తానన్నారు. కొన్ని ప్రత్యేక అంశాలపై లోక్‌సభలో అర్ధవంతంగా చర్చ జరుగుతున్నప్పటికీ, రాజ్యసభలో చర్చలు లోతుగా ఉండటం లేదని అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు.
పెప్పర్ స్ప్రే వంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రజాసమస్యలు చర్చించడం కన్నా తిట్ల పురాణం ఇటీవల కాలంలో ఎక్కువ కావడం బాధాకరమైన విషయమన్నారు. పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తిని మరిచి వ్యక్తిగత అజెండాలు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా వ్యవహరిస్తున్నాయన్నారు.
ఏ రాష్ట్రానికైనా ప్రయోజనాలు ముఖ్యమేగాని విశాలమైన దృక్పథంతో ప్రజలకు ప్రయోజనాలు ముఖ్యమనే భావన నేతల్లో ఉండాలన్నారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఉండి, భీమవరం ఎమ్మెల్యేలు వేటుకూరి శివరామరాజు, పులపర్తి రామాంజనేయులు, విష్ణు విద్యాసంస్థల అధినేత కెవి విష్ణురాజు, బిజెపి నేత రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.