రాష్ట్రీయం

500 దళితవాడల్లో ఆలయాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 20: రాష్ట్రంలోని 500 ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం తెలిపారు. 5 లక్షల రూపాయలతో ఒక్కో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విలేఖర్లకు తెలియజేశారు. రాష్టవ్య్రాప్తంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నిర్మించనున్న ఆలయాలకు 25కోట్ల నిధులను దేవాదాయ శాఖకు ఇవ్వాలని టిటిడి గతంలో నిర్ణయించిందన్నారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం ఐదు కోట్ల నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిందన్నారు. విదేశాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను ఆయా ప్రాంతాల్లో రెండురోజుల పాటు నిర్వహించేందుకు ఆమోదించామన్నారు. ఉత్సవాల నిర్వహణకు అయ్యే ఖర్చును దాతలే భరించాల్సి ఉంటుందన్నారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో 1.25 కోట్లతో కల్యాణ మండపం నిర్మించడానికి ఆమోదం తెలిపామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం జడ్ భవరం గ్రామంలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి 20.70 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శ్రీరామాలయ పునర్నిర్మాణానికి 22.50 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయ గోపురం, సాలాహరం నిర్మాణానికి 22.50 లక్షలు మంజూరు చేశారన్నారు. కడప జిల్లా ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామంలో ఉన్న శ్రీనాగేశ్వర స్వామి ఆలయ మరమ్మతులకు 19.80 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. చిత్తూరు జిల్లా ఉట్లవారిపల్లిలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆల యం చెంత 95 లక్షల రూపాయల వ్యయంతో డార్మెటరీ హాల్, గదులు నిర్మిస్తామన్నారు.
గుంటూరు జిల్లా ఎడ్లపాడులో కల్యాణ మండపం నిర్మాణానికి 1.25 కోట్లు మంజూరు చేశారన్నారు. అహ్మదాబాద్‌లో టిటిడి ఆడిటోరియం నిర్మాణానికి 3.45 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. టిటిడి ఆస్థాన సిద్ధాంతిగా ఉన్న తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ పదవీ కాలపరిమితిని మరో మూడేళ్లు పెంచినట్లు తెలిపారు.