రాష్ట్రీయం

శ్రీశైలానికి భారీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 26: శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అంశంపై మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 880.95 అడుగులకు నీరు చేరింది. గరిష్ట నీటినిల్వ 215.8 టిఎంసిలకు గాను 192.85 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి 1,40,214 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 7, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 6 జనరేటర్లను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసి 77,673 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉత్తర కర్నాటక, మహారాష్టల్రో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలకు అవకాశముందని, దీని కారణంగా కృష్ణానదిలో సుమారు మూడు నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని ఐఎండి అంచనా వేస్తోంది. దీంతో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పంపింది. ఇప్పటికే కృష్ణానదిపై నిర్మించిన అన్ని జలాశయాలు నిండి కళకళలాడుతున్నాయి. ఎగువ నుంచి వచ్చే నీటిని అలాగే దిగువకు వదిలే అవకాశముంది. ఫలితంగా కృష్ణానది పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు మునకకు గురయ్యే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలను అందచా వేస్తూ ఐఎండి నుంచి మంగళవారం మరో బులెటిన్ వస్తుందని దాని ఆధారంగా శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసి 880 అడుగుల నీటిమట్టం స్థిరంగా కొనసాగిస్తామని, వరద ఉద్ధృతి తగ్గగానే తిరిగి 885 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.