రాష్ట్రీయం

మూడో దశ మెడికల్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో మెడికల్, డెంటల్ కాలేజీల్లో ( ఎమ్సెట్-3) యుజి కోర్సుల అడ్మిషన్లకు మూడో దశ కౌనె్సలింగ్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అలాగే మూడో దశలో మల్లారెడ్డి కాలేజీ ఫర్ ఉమెన్‌లో సీట్లు కేటాయిస్తారు. 28వ తేదీ రాత్రిలోగా స్పోర్ట్సు కోటా సీట్లు జాబితాను స్పోర్ట్సు అధికారులు అందజేస్తే వాటిని సైతం భర్తీ చేస్తారు. 29వ తేదీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోగా వెబ్ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. రాత్రికి అలాట్‌మెంట్ జరుగుతుంది. అభ్యర్థులు 30వ తేదీన సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
జెఎన్‌టియు హెచ్ ఫలితాలు వెల్లడి
జెఎన్‌టియుహెచ్ బిటెక్ , బి పార్మసీ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం నాడు విడుదల చేసినట్టు ఇవాల్యూయేషన్ డైరెక్టర్ ఆంజనేయ ప్రసాద్ చెప్పారు.
జెఎన్‌టియులో భారీగా ప్లేస్‌మెంట్
హైదరాబాద్ జెఎన్‌టియులో 296 మందికి దేశంలో ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో ఉద్యోగాలు దక్కాయని ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ గోవర్ధన్ చెప్పారు. గరిష్టంగా 12 లక్షల వేతనం ఆఫర్ చేశారని పేర్కొన్నారు. టెరాడాటా, మోడల్ ఎన్, నెట్ క్రాకర్స్, ఈజీ సాఫ్ట్, మైక్రోసాఫ్ట్, పోర్టువేర్, క్వెస్ట్, నెక్ట్స్ ఎడ్యుకేషన్, యుహెచ్‌జి, వెల్స్ ఫోర్జు, మిసీ, ఒరాకల్, టిసిఎస్, విప్రో, ఎంఎం వేర్, కా టెక్నిలజీ, ఐయాన్ , మేథా తదితర సంస్థల్లో తమ ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఉద్యోగాలు దక్కాయని పేర్కొన్నారు.
మిచిగాన్ వర్శిటీకి యూఓహెచ్ ప్రొఫెసర్
మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత ఆంగ్లరచయిత షేక్‌స్పియర్‌పై జరుగుతున్న సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సత్యబ్రత రౌత్‌కు అవకాశం దక్కింది. అక్టోబర్ 1 నుండి 23వ తేదీ వరకూ జరిగే సాహితీ సమ్మేళనంలో డాక్టర్ సత్యబ్రత రౌత్ షేక్‌స్పియర్ ఉత్సవానికి హాజరవడంతో పాటు అక్కడ రంగస్థల తరగతులను సైతం తీసుకుంటారు. షేక్‌స్పియర్ రచనల్లో భారతీయత అంశంపై ప్రత్యేకించి మాట్లాడతారు.