రాష్ట్రీయం

షీలాభిడే కమిటీ పొడిగింపుతో ఆర్టీసి విభజన వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపి పునర్విభజన చట్టంలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, ఆస్తులు- అప్పులు, ఉద్యోగుల పంపకాలపై కేంద్రం నియమించిన షీలా భిడేకమిటీ పని కాలాన్ని పొడిగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వరకు ఈ కమిటీని పొడిగించారు. ఈ మేరకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసి విభజన త్వరలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 31తో ముగిసింది. ఏపి పునర్విభజన చట్టంలో 9వ షెడ్యూల్‌లో 91 సంస్థలున్నాయి. ఇందులో కమిటీ 59 కంపెనీలపై నివేదికలు అందించింది. మరో 32 సంస్థలపై నివేదికను తయారు చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి విభజన ఇంకా పూర్తి కాలేదు. రెండు రాష్ట్రాలు హైదరాబాద్‌లో ఆర్టీసికి ఉన్న ఉమ్మడి ఆస్తులపై పట్టుబడుతున్నాయి. తాత్కాలికంగా రెండు రాష్ట్రాలు తమ పరిధిలో ఆర్టీసి పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేశాయి. కాని ఆర్టీసి విభజనను కేంద్రం ఇంకా ఆమోదించలేదు. షీలాబేడీ కమిటీని పొడిగించడంతో ఆర్టీసి ఆస్తులు, అప్పులపై త్వరలో రెండు రాష్ట్రాలు రాజీఫార్ములాకు వచ్చే అవకాశం ఉంది.