ఆంధ్రప్రదేశ్‌

రైళ్ల కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: కొన్నిరోజులుగా ప్రయాణికులు అనునిత్యం విజయవాడ రైల్వేస్టేషన్ ఔటర్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి ఎట్టకేలకు తప్పింది. దాదాపు రూ. 150 కోట్లతో రూట్ ఇంటర్ లాకింగ్ సిస్టం ఏర్పాటు కోసం ఈ నెల 21 నుంచి 28వరకు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచినప్పటికీ ప్రయాణికులు ఎంతగానో సహకరించారు. అలాగే రైల్వే అధికారులు కూడా దాదాపు మూడు వేలమంది కార్మికులతో రాత్రి, పగలు పనులు చేయించి పనులను శరవేగంగా పూర్తి చేయించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి నూతన ఆర్‌ఆర్‌ఐ సిస్టం ద్వారా రైళ్లు క్రమేణా ఆయా ప్లాట్‌ఫారాలపైకి రావటం ప్రారంభమైంది. కాజీపేట మీదుగా విజయవాడ వైపు నుంచి చెన్నై, తిరుపతి, గుంటూరు వైపువెళ్లే రైళ్లను అటు... ఇటు కూడా కృష్ణానదిపై ఉన్న మూడో వంతెనపై నుంచి 8,9,10 ప్లాట్‌ఫారాల మీదుగా నడిపే వారు. ఇక నేటి నుంచి ఒకటి నుంచి ఏడు ప్లాట్‌ఫారాల మీదకు రైళ్ల రాకపోకలు సాగించే విధంగా ఆర్‌ఆర్‌ఐ అనుసంధానం చేశారు. అయితే మరో మూడు రోజుల్లో అరకొరగా మిగిలిన పనులు కూడా పూర్తి కానున్నాయి. ప్రధానంగా 4వ నెంబర్ ప్లాట్‌ఫారం 21 బోగీలకు బదులుగా 24 బోగీలు పట్టే విధంగా పొడిగింపు, ర్యాంప్ నిర్మాణం వంటి పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇక ఈ 8 రోజులు మొత్తంపై విజయవాడ స్టేషన్‌లో 190 రైళ్లు పూర్తిగా రద్దు కాగా 358 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. 210 రైళ్లను దారి మళ్లించడం జరిగింది. కేవలం 8 రైళ్లను మాత్రమే బయలుదేరాల్సిన సమయాలను కాస్త అటూ ఇటూ మార్చడం జరిగింది.