రాష్ట్రీయం

జిల్లాల పునర్విభజనపై భగ్గుమన్న భద్రాచలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 4: తెలంగాణ సర్కారు చేపట్టిన జిల్లాల పునర్విభజనను నిరసిస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యం భగ్గుమంటోంది. కొత్తగూడెం జిల్లా నుంచి వాజేడు, వెంకటాపురం మండలాలను వేరు చేసి భూపాల్‌పల్లి జిల్లాలో విలీనం చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనలను అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన, దళిత, ప్రజాసంఘాలు తప్పుబడుతున్నాయి. వెంకటాపురం మండలంలో అఖిలపక్షం 72 గంటల బంద్‌ను నిర్వహించింది. ఈ బంద్‌లో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పాల్గొనగా ప్రజాప్రతినిధులు ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచిలు హాజరై నిరసనగా రాజీనామాలకు సిద్ధం అంటూ తీర్మానం చేశారు. ప్రజాభీష్టానికి బాసటగా నిలుస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటించడంతో ఉద్యమం రాజుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర విభజన పేరుతో భద్రాచలం డివిజన్ నుంచి నెల్లిపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలను విడగొట్టారని, ఇప్పుడు తెలంగాణ సర్కారు జిల్లాల పునర్విభజన పేరుతో వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్‌పల్లి జిల్లాలో కలపడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని అఖిలపక్షం ఆరోపిస్తోంది. ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని చేపట్టేందుకు అఖిలపక్షం నడుం బిగించింది. మరో వైపు గిరిజన సంఘాలు సైతం ఇది అశాస్ర్తియమైన విభజన అంటూ గళం విప్పింది. ఆదివాసీ జిల్లా కావాలని తాము పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఆదివాసీ జాతిని విచ్ఛిన్నం చేసే ప్రక్రియకు తెరలేపిందని గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు సొంది వీరయ్య, కొండరెడ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముర్ల రమేశ్‌లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మరో వైపు సిపిఎం కూడా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్‌పల్లిలో కలపడాన్ని నిరసిస్తూ భద్రాచలంలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసింది. సిపిఐ నేతలు కూడా భద్రాచలంలో సమావేశమై ప్రజాప్రతినిధులతో కూడగట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాలని కార్యాచరణ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మయ్య సైతం ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి విభజన విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జిల్లాల విభజనపై రాజుకున్న చిచ్చు అంతకంతకు పెరుగుతూ ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్‌పల్లిలో కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాన్ని గట్టిగా ప్రజలు, రాజకీయ నాయకులు విన్పిస్తున్నారు.

చిత్రం.. భద్రాచలంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సిపిఎం నేతలు