రాష్ట్రీయం

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, ఇంటర్‌సెప్టర్ వాహనాల ఏర్పాటుతో ప్రమాద మృతులు కూడా తగ్గాయని డిజిపి జెవి రాముడు తెలిపారు. గత వారం రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే ఈ వారంలో 634 ప్రమాద కేసులు తగ్గాయన్నారు. ఈ నెల 9నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో 2,847 కేసులు నమోదు కాగా, 16నుంచి 22వ, తేదీ వరకు 2,213 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ వారం రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 66మంది మృతి చెందగా, గత వారంలో 70మంది మృత్యువాత పడ్డారని, 301మంది గాయపడ్డారు. గత వారం కంటే ఈ వారం 258మంది గాయపడ్డారని డిజిపి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేపట్టిన భద్రతల్లో భాగంగా జాతీయ రహదారిపై నిఘా పెట్టామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినతరంగా వ్యవహరిస్తున్నామని వివరించారు. పది జిల్లాల్లో జాతీయ రహదారి 16పై నమోదైన కేసులు శ్రీకాకుళం జిల్లాలో 197 కేసులు, విజయనగరంలో 173, తూర్పుగోదావరి 592, ప్రకాశం 300, నెల్లూరు 31, కర్నూలు 189, అనంతపురం 430, చిత్తూరు 60, తిరుపతి అర్బన్ 180, విశాఖపట్నం సిటీ 695 ప్రమాదాలకు సంబంధించి కేసులు నమోదైనట్టు డిజిపి పేర్కొన్నారు.