రాష్ట్రీయం

సైన్యం తెచ్చిన విజయదశమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదరగొట్టెను ఆనాడు అర్జునుండు
గోవులందోలుకొని పోవు కురుదొరలను
విరట దేశాన వెలిగెను విజయదశమి
మచ్చు చూపించె పాండవ మహిత శక్తి

విజయదశమిని తలపింప విరుచుకుపడె
సింగురణబీరు చీకట్లు చీల్చుకొనుచు
భాద్రపద బహుళ చతుర్థి భానుమూర్తి
లేచుమునె్న శత్రువులన లేపినాడు

మోది మోదెను నేడుగ్రవాదమనెడి
పాకుఢంకాను చిత్తుగా పగులగొట్టె
నాడు కవి సార్వభౌమ శ్రీనాధుడట్లు
ముక్తిద్వారము తెరచెను యుక్త్భివికి

ఇరువది తొమ్మిది సెప్టెం
బరు భారత చరితమందు బంగరువ్రాతన్
మురిపెముగ చెప్పదగినది
భరతావని పులకరించి భాగ్యమునొందెన్

శరదృతువునకును ముందే
వరమగు ఘన విజయదశమి వరలుట చేతన్
అరులకు హెచ్చరికే యిది
మరి మాతో యుద్ధమన్న మసియగుటేగా!
భారతీయుల సైన్యపు పాటవమునకు
భాద్రపద బహుళ చతుర్థి వనె్నతెచ్చె
విజయదశమికి దీటుగా విజయమొసగి
శత్రుగుండెల నినదించె జయపుఘోష

-ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం