రాష్ట్రీయం

హుదూద్ గాయానికి రెండేళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 12: విశాఖ నగర ప్రజలు 2014 అక్టోబర్ 12వ తేదీని ఎన్నటికీ మరిచిపోలేరు. అందాల విశాఖను వణికించి, చిన్నాభిన్నం చేసిన రోజు అది. ప్రకృతి విలయ తాండవానికి పరాకాష్ట అది. పచ్చని చెట్లతో రమణీయంగా కనిపించే విశాఖ హుదూద్ ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. తరుముకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే నాసా హెచ్చరించడంతో, ప్రాణనష్టం పెద్దగా జరగలేదు., కానీ అనూహ్యమైన ఆస్తి నష్టం వాటిల్లింది. పచ్చదనం అంతా గాలి, వానకు కొట్టుకుపోయి, విశాఖ కన్నీటి సంద్రంగా మారింది.
విశాఖను పెను తుపాను ముంచుకొస్తోందని అమెరికాలోని నాసా సుమారు అక్టోబర్ ఏడో తేదీనే హెచ్చరించింది. అమెరికా ప్రయోగించిన ఆక్వా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ప్రమాద తీవ్రతను గంట గంటకు హెచ్చరిస్తూ వచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. విశాఖ వాసులను ఇళ్ళ నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం గంట గంటకు బులిటెన్లు విడుదల చేస్తూ వచ్చింది. 11 అర్ధరాత్రి నుంచి చిన్నగా ప్రారంభమైన వర్షం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. 12న తెల్లవారుజాము నుంచే పెను గాలులతో కూడిన వర్షం విశాఖను చుట్టేసింది. అదే సమయంలో జరగాల్సిన బీభత్సం అంతా జరిగిపోయింది. నగరంలోని చెట్లన్నీ నేలకూలాయి. ఇళ్ళ పైకప్పులు, పూరిళ్లు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. విద్యుత్ వైర్లు చిన్నాభిన్నమైపోయాయి. భారీ కర్మాగారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తూర్పు నౌకాదళంలో వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఒక్కమాటలో చెప్పాలంటే, విశాఖ నగరం ధ్వంసమైపోయింది. దెబ్బతిన్న నగరాన్ని పునర్‌నిర్మించే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు ఆయన అహరహం శ్రమించారు. పూర్తిగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ యథాస్థితికి రావడానికి సుమారు నెల రోజులు పట్టింది. విమానాశ్రయం శిథిలమవడంతో సుమారు 10 రోజులపాటు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అత్యవసర సహకారంతో విశాఖ నెమ్మది నెమ్మదిగా కోలుకుంది.
విశాఖలో గత ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. దీన్ని పురస్కరించుకుని హుదూద్‌లో దెబ్బతిన్న విశాఖ నగరాన్ని వేల కోట్ల రూపాయలతో పునర్‌నిర్మించారు. ఇప్పుడు విశాఖ నగరం కోలుకుంది. కానీ అప్పట్లో ప్రధాని మోదీ వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. కానీ ఇచ్చింది మాత్రం 630కోట్లు మాత్రమే. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మూడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కానీ ప్లాంట్‌కు ఇన్సూరెన్స్ కింద రూ.100 కోట్లు మాత్రమే వచ్చింది. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ 1400 కోట్ల నష్టాన్ని పూడ్చుకోవలసి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని హుదూద్ బాధితులకు సాయం చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది.