రాష్ట్రీయం

గోదావరి నీళ్లిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 13: ‘పెన్నా, గోదావరి నదుల అనుసంధాన సంకల్పంతో ఉన్నా, గోదావరి నీళ్లను సోమశిలకు తీసుకువచ్చి చూపించి తీరుతా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గురువారం నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా రొట్టెల పండగకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తమదన్నారు. గోదావరి నీళ్లు నెల్లూరు చెరువుకు చేరుకునే రోజు రానుందన్నారు. మత సామరస్యానికి రొట్టెల పండగ తార్కాణమని, పక్క రాష్ట్రాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌది అరేబియా తదితర దేశాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి తమ కోర్కెలు ఫలించాలని రొట్టెలు పట్టుకోవడం చూస్తుంటే ఈ దర్గా గొప్పతనం అర్థమవుతుందని అన్నారు. జిల్లాకే తలమానికమైన కృష్ణపట్నం పోర్టు వలన నెల్లూరు నగరం మెగాసిటీగా రూపొందనుందన్నారు. ఇప్పటికే 14 భారీ పరిశ్రమలు నెల్లూరు జిల్లాలో ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన బెంగళూరు-చెన్నై, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్లు రెండు ఉండే అవకాశం నెల్లూరు జిల్లాకు దక్కిందన్నారు. నవంబర్ 1 నుంచి రెండవ విడత రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ దఫా అందించే రూ.3వేలు మహిళలు తమ సొంత అవసరాలకు వాడుకోవచ్చని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 350కోట్లతో నిర్మిస్తున్న సంగం, నెల్లూరు బ్యారేజీలను రాబోయే మార్చి నెలాఖరునాటికి పూర్తి చేస్తామని హామీనిచ్చారు.

చిత్రం.. నెల్లూరు స్వర్ణాల చెరువులో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి నుంచి
అభివృద్ధి రొట్టెను అందుకుంటున్న చంద్రబాబు నాయుడు