రాష్ట్రీయం

ఫార్మా సిటీకి తరలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13:తెలంగాణలో భారీయెత్తున ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు అమెరికాలోని పలు కంపెనీల ప్రతినిధులను కలుస్తున్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ యునైటెడ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఎజెన్సీ ప్రతినిధుల బృందంతో గురువారం సమావేశం అయ్యారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ, అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలను అందిపుచ్చుకుని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోయేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక గురించి మాట్లాడారు. నగరంలోని ఫార్మా కంపెనీలను ఔటర్ రింగ్‌రోడ్డు అవతల ఉన్న ఫార్మా సిటీకి తరలించేందుకు తీసుకుంటున్న చర్యలను సమావేశంలో మంత్రి ప్రస్తావించారు.
ఈ అంశంలో మార్గదర్శకాల రూపకల్పనలో ప్రభుత్వానికి సహకరించేందుకు అమెరికాలోని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ముందుకు వచ్చింది. ఫైజర్, ఏలీ లీలీ, అలెక్సియన్, మెర్క్, అమ్జెన్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కెటిఆర్ తెలంగాణలో ఫార్మా రంగానికి ఉన్న అవకాశాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా క్లీవ్‌లాండ్ మోటార్ సైకిల్ వర్క్ కంపెనీతో కెటిఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని కంపెనీ సిఇఓ జొనాథన్‌ను కోరారు. కమ్యూని క్లిక్ సంస్థకు చెందిన రామ్‌రెడ్డితోనూ మంత్రి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తమ సంస్థ విభాగాన్ని ప్రారంభించేందుకు రాంరెడ్డి ముందుకు వచ్చారు. గ్లోబల్ ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్ సమ్మిట్ 2017 నిర్వాహకులు డైరెక్టర్ టామ్ లెర్సస్టెస్‌తో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కెటిఆర్ తెలిపారు. అమెరికాలోని తాత్కాలిక భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్ సంధు, హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా నియమితులైన కథెరినే బి హడ్డా, బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మార్క్ అలెన్‌లతోనూ మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు.

చిత్రం.. అమెరికాలోని ఫార్మా కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్