రాష్ట్రీయం

ఎంతెంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13:హైదరాబాద్ చుట్టుపక్కల నివాసం ఉంటూ, ఇతర జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు పెద్ద చిక్కే వచ్చిపడింది. మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన దాదాపు 20 వేలమంది ఉద్యోగులు తమకు కష్టకాలం దాపురించిందని బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న వీరు జిల్లాల స్వరూపం మారడంతో హైదరాబాద్ నుండి 150-200 కిలోమీటర్ల దూరంలోని తమ స్వస్థలాలకు వెళ్లాల్సి వచ్చేలా ఉంది. అదే వారి బెంగకు కారణం.
హైదరాబాద్‌నుంచి వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న కల్వకుర్తి, జడ్చర్ల, నార్కట్‌పల్లి, జనగామ, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్‌లలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల్లో నూటికి 75 శాతం మంది హైదరాబాద్‌నుంచే రాకపోకలు జరుపుతుంటారు. రోజూ ఉదయం డ్యూటీకి వెళ్లి రాత్రి వేళకి తిరిగి హైదరాబాద్ చేరతారు. పిల్లల చదువు, ఆరోగ్యం తదితర కారణాలతో వీరు రాజధాని నగరాన్ని వీడి వెళ్లేందుకు ఇష్టపడరు. బదిలీలు జరిగినా హైదరాబాద్‌కు సమీప గ్రామాలు లేదా పట్టణాల్లో పోస్టింగ్ వచ్చేలా జాగ్రత్త పడుతుంటారు. జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో ఇక వీరంతా మూటాముల్లె సర్దుకుని స్వస్థలాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఉదాహరణకు నల్లగొండ పాత జిల్లా కోదాడ సమీపంలోని మల్లారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఒకప్పుడు నానా తంటాలుపడి చౌటుప్పల్ ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. వీరంతా వనస్థలిపురం, హయత్‌నగర్‌లలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. ఇప్పుడు వీరి సొంత గ్రామం సూర్యాపేట జిల్లా పరిధిలోకి వచ్చింది. అలాగే కొల్లాపూర్ సమీపంలోని పెంట్లవల్లి తదితర ప్రాంతాలకు చెందిన కొందరు హైదరాబాద్-ఆమన్‌గల్ మధ్య ఉన్న గ్రామాల్లో పనిచేస్తున్నారు. వీరు సంతోష్‌నగర్, కర్మన్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వీరి సొంత గ్రామాలు
నాగర్‌కర్నూలు జిల్లాపరిధిలోకి వచ్చాయి. ఇదేవిధంగా రంగారెడ్డి, మెదక్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన ఉద్యోగులు హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తూ, రాజధాని శివార్లలో నివాసం ఉంటున్నారు. జిల్లాస్థాయి ఉద్యోగులు నియమ, నిబంధనల ప్రకారం సొంత జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తున్న దాదాపు 20 వేల మంది ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయకతప్పదు.
ప్రజాప్రతినిధులపై ఒత్తిడి
హైదరాబాద్, సికింద్రాబాద్ శివార్లలో నివాసం ఉంటూ సమీప జిల్లాల్లో పనిచేస్తున్నవారు తమ సొంత జిల్లాలకు వెళ్లకుండా అడ్డుచక్రం ఎలా వేయాలా అని ఆలోచిస్తున్నారు. ఉద్యోగులకు ఆప్షన్ ఇస్తే తమ ఇష్టం ఉన్న జిల్లాల్లో పనిచేసే అవకాశాన్ని ఎంచుకోవాలని భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి నేటివిటీ పరిధిలోకి వచ్చేవారు శంషాబాద్ (రంగారెడ్డి) జిల్లాకు, సూర్యాపేట నేటివిటీ ఉన్న వారు మేడ్చల్ లేదా భువనగిరి జిల్లాకు ఆప్షన్ పెట్టుకుని బదిలీల బాధ నుండి విముక్తి పొందవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తమకు తెలిసిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ద్వారా పైరవీ చేయించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ, ఇప్పటికిప్పుడే ఈ ఉద్యోగులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ, ఏడాది కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడక తప్పదు.