రాష్ట్రీయం

మెట్రో గుంతలో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, అక్టోబర్ 13:మెట్రోరైల్ కారిడార్‌లో భాగంగా పిల్లర్ వేసేందుకు తవ్విన గుంత ఓ బాలుడి ప్రాణాన్ని బలిగొంది. సికిందరాబాద్ బోయిగూడకు చెందిన జ్యోతి, శ్యాంబాబు దంపతులు తమ ముగ్గురు పిల్లలతో పాత గాంధీ ఆసుపత్రి వద్ద ఫుట్‌పాత్ పక్కనే గుడిసె వేసుకొని బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా గతేడాది శ్యాంబాబు అనారోగ్యంతో మృతి చెందగా, ముగ్గురు పిల్లలతో జ్యోతి ఫుట్‌పాత్‌పైనే రోజులు నెట్టుకొస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆమె పెద్దకొడుకు తొమ్మిదేళ్ల నరసింహ ఆడుకుంటూ వెళ్లి నీటితో నిండివున్న మెట్రో పిల్లర్ గుంతలో పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత కొడుకు కనిపించకపోవడంతో అనుమానంతో గుంత వద్దకు
వెళ్లి చూడగా నీటిపై తేలుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న మోండా మార్కెట్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మెట్రో అధికారుల నిర్లక్ష్యం వల్లనే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి తల్లికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డికి ఫోన్ చేసి, బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఎండి రెడ్డి, నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి ప్రతినిధులతో మాట్లాడారు. బాలుడి కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు అంగీకరించడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.

చిత్రం.. సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ వద్ద మెట్రోరైల్ పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి మృతి చెందిన బాలుడు