రాష్ట్రీయం

పరిపాలనపై పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: కొత్త జిల్లాల ఫలాలు ప్రజలకు అందేలా ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కలెక్టర్లకు హితవు చెప్పారు. కొత్తగా ఏర్పాటైన పరిపాలన కేంద్రాలలో సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు సాగాలన్నారు. కొత్త జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లతో గురువారం సిఎస్ మాట్లాడారు. జిల్లాలకు నియమితులైన అధికారులంతా విధుల్లో చేరారా? ఉద్యోగుల హాజరుశాతం ఎలా ఉంది, వౌలిక వసతులు ఎలా ఉన్నాయి వంటి వివరాలను సిఎస్ ఆరా తీశారు. దశాబ్దాల తరబడి కొనసాగిన పరిపాలన కేంద్రాలు ఒక్కసారిగా మారడంవల్ల ఇబ్బందులు తలెత్తడం సహజమేనని, వాటిని అధిగమించుకుంటూ ముందుకు సాగాలని రాజీవ్ శర్మ సూచించారు. కొత్త జిల్లాల్లో పాలనాపరమైన సమస్యలు ఏమైనా తలెత్తితే గతంలో మాతృ జిల్లాల్లో పనిచేసిన కలెక్టర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు.
ఇలాఉండగా జిల్లాల ఆవిర్భావం తర్వాత వారం పది రోజులలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి మార్గనిర్దేశం చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అయితే వారం పది రోజుల తర్వాత కొత్త జిల్లాల్లో పాలన గాడిలో పడిన తర్వాత వారితో సమావేశం ఏర్పాటు చేయడమా? లేక రెండు వారాల తర్వాత వచ్చే నెల మొదటి వారంలో సమావేశం పెట్టడమా? అని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు తెలిసింది. కొత్త జిల్లాలకు కేటాయించిన అధికారులంతా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనాపరంగా ఎదురయ్యే సమస్యలపై వారం పది రోజులు గడిస్తే ఒక అవగాహన వస్తుందని అప్పుడు సమావేశం కావడం ఉత్తమమని ముఖ్యమంత్రి అభిప్రాయపడిన్నట్టు తెలిసింది. కొత్త జిల్లాలకు పూర్తిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది నియామకం అయ్యే వరకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు పొందిన వారే విధులు నిర్వహిస్తుండటంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును వారి నుంచి ఆశించలేమని ప్రభుత్వం భావిస్తుంది. తాత్కాలిక విధులు నిర్వహిస్తున్న వారికి మార్గనిర్దేశం చేయడం వల్ల ప్రయోజనం లేదని, పూర్తిస్థాయి ఉద్యోగుల నియామక ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే వారికి మార్గనిర్దేశం చేయడం మంచిదని రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.